బాహుబలి నిర్మాతలను కలిసిన ప్రభాస్
అంతర్జాతీయస్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ గొప్పదనాన్ని చాటిచెప్పాయి బాహుబలి సినిమాలు. ఈ చిత్రాలు ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి. కొంతకాలం నుంచి బాహుబలి-3 రాబోతుందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూరే సంఘటన జరిగింది.
'బాహుబలి' మూడో భాగం గురించి: బాహుబలి నిర్మాతలను ప్రభాస్ కలివారు. పార్ట్3 కోసమేననే చర్చ మొదలైంది. 'బాహుబలి' నిర్మాతలు ప్రభాస్ కోసం ఓ కథను ఫైనలైజ్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ఇప్పటి వరకూ చేయని క్యారక్టర్‌ను ఈ సినిమాలో చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. 'బాహుబలి' రెండు పార్ట్‌లకన్నా ఈ కథ చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

గతంలో 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలకు ముందు ప్రభాస్ ఓ సందర్భంగా 'బాహుబలి' మూడో భాగం గురించి మాట్లాడారు. పార్ట్-3 గురించి తనకు కూడా తెలియదని, సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. తాజాగా ఆ సినిమా నిర్మాతలను కలవడంతో ఆ మాటలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే ప్రభాస్ వీరిని ఎందుకు కలిశారు? ఏ విషయం చర్చించారనే విషయంలో స్పష్టత రాలేదు.
బిజీగా ఉన్న రాజమౌళి: ఇటీవల ఓ మీడియాతో బాహుబలి నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ దేవినేని సీక్వెల్ గురించి మాట్లాడారు. ''మూడో భాగం వచ్చే అవకాశం ఉందని, అయితే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేమని, ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి బిజీగా ఉన్నారని, తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ అయ్యాక దీని గురించి ఆలోచిస్తామన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏదో ఒక సమయంలో పార్ట్3 తెరకెక్కుతుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభమవలేదన్నారు.
యాక్షన్ అడ్వెంచర్ కోసం: ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. అలాగే దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు కథానాయకుడిగా ఒక అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దాదాపు ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. దాదాపు రెండు సంవత్సరాల వరకు రాజమౌళి బిజీగా ఉంటారు. బాహుబలి-3 తెరకెక్కితే అప్పుడే అంటున్నారు.












Click it and Unblock the Notifications