మరదలిపై కన్నేసిన బావ ఘాతుకం .. వారం రోజుల్లో పెళ్లనగా.. పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం
వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చిత్తూరు జిల్లాలో మిస్టరీగా మారింది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై గుర్తు తెలియని ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాల పాలు కాగా మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరదలిపై కన్నేసిన అక్క మొగుడి పనే అని అనుమానం వ్యక్తం అవుతుంది.

అవివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో పోలీసుల దర్యాప్తు
అవివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనకు కారకులైన వారెవరు అన్నదానిపై పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం గట్టు కింద పల్లిలో జరిగిన దారుణం లో గ్రామానికి చెందిన ఇరవై నాలుగేళ్ల సుమతి ఇంటి వరండాలో నిద్రొస్తోంది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అయితే మరదలిపై కన్నేసిన అక్క మొగుడు ఈ ఘటనకు బాధ్యుడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లారు.

ఘటనా స్థలంలో కోళ్ళు, కుక్కలు , పిల్లి మృతి .. విషప్రయోగం చేశారని బాధిత కుటుంబం ఆరోపణ
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. అంతేకాదు సంఘటన స్థలంలో కుక్కలు, కోళ్లు మృతి చెంది ఉండడంతో అగ్నిప్రమాద కోణంలోనే కాకుండా, వాటిపై మరేమైనా విషప్రయోగం జరిగిందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన సమయంలో ఇంటి దగ్గర పెంచుకున్న కుక్కలు మొరగకుండా విషప్రయోగం చేసినట్లుగా బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పదిహేను కోళ్లు ,రెండు కుక్కలు, ఒక పిల్లి మృతి చెందిందని వారు పేర్కొన్నారు.

చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతి .. అక్క మొగుడి పనేనా ?
వారం రోజుల్లో పెళ్లి ఉందనగా ఈ దారుణం జరగడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సుమతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సుమతిపై సొంత కుటుంబానికి చెందిన వారే ఈ దాడికి పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరదలిని పెళ్లి చేసుకోవాలన్న దుర్బుద్ధితో నే, తనకు కాకుండా పోతుంది అని అక్కసుతో అక్క భర్తనే ఇది చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధితులు, స్థానికులు చెబుతున్న వివరాల మేరకు పోలీసులు ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications