Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదా ? ఇది మీ కోసమే..!

ఏపీలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం కింద నిధుల్ని తాజాగా విడుదల చేశారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా.. దీనికి పీఎం కిసాన్ 21వ విడత నిధులు అయిన 2 వేలు కలిపి ప్రభుత్వం మొత్తం 7 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా పలువురు రైతులు తమకు డబ్బులు రాలేదనే ఆందోళనలో ఉన్నారు. వారి కోసమే ఈ అప్డేట్.

పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద జమ కావాల్సిన మొత్తాలు జమ కాకపోవడం వెనుక పలు కారణాలు ఉంటున్నాయి. ఇందులో ముఖ్యమైనది ఈ-కేవైసీ పూర్తి చేసుకోకపోవడం. దీని వల్ల ఆయా రైతులకు డబ్బులు జమ కావట్లేదు. దీనికి పరిష్కారంగా కేంద్రం ఈ-కేవైసీ పూర్తి చేయడానికి బయోమెట్రిక్ లేదా ఐరిష్ ద్వారా అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం మీసేవ కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ లకు ఈ అవకాశం అందుబాటులో ఉంది.

Your PM Kisan-Annadata Sukhibhava Funds Haven t Credited Here s What to Check

రైతులు ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న 30 నుండి 60 రోజులలో వారికి ఎన్పీసీఐ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అలాగే ఈ పథకం డబ్బులు రాకపోవడానికి మరో కారణం రైతు ఆధార్ కి పట్టాదారు పాసుబుక్ లింక్ లేకపోవడం. ఇలాంటి వారు గ్రామ సచివాలయాన్ని సందర్శించి డిజిటల్ అసిస్టెంట్ దగ్గర పట్టాదార్ పాసుబుక్ కి ఆధార్ లింక్ అప్లికేషన్ పూర్తి చేసి ఇస్తే వారు మీ థంబ్ లేదా ఓటీపీ తో లింక్ రిక్వెస్ట్ తహసీల్దార్ కార్యాలయానికి పంపుతారు. అక్కడ పూర్తయ్యాక గ్రామంలోని రైతు సేవా కేంద్రం సిబ్బందిని కలిసి ఈ విషయం చెబితే మండల వ్యవసాయ అధికారి ద్వారా జిల్లా కార్యాలయానికి రైతు వివరాలు పంపిస్తారు.

అలాగే పీఎం కిసాన్-అన్నదాత పథకం డబ్బులు జమ కాకపోవడానికి మరో కారణం రైతు బ్యాంక్ ఖాతా ఆధార్ తో అనుసంధానం కాక పోవడం. దీనికి రైతు చివరగా ఓపెన్ చేసిన బ్యాంక్ వద్దకి వెళ్లి ఎన్పీసీఐ లింక్ చేయించుకోవడం లేదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ లో కొత్త ఖాతా ఓపెన్ చేస్తే ఎన్పీసీఐ లింక్ అవుతుంది. రైతుకి ఎన్పీసీఐ లింక్ అయినప్పటి నుండి 30 నుండి 90 రోజుల వ్యవధి లో వారికీ ఆగిన నగదు జమ అవుతుంది. అలాగే 2019 ఫిబ్రవరి నెల తరువాత పొలం మ్యుటేషన్ జరిగిన వాటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పధకానికి ప్రస్తుతానికి అర్హత అవకాశం ఇవ్వలేదు.భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ పధకం ద్వారా లబ్ది పొందుతూ మరణిస్తే వారి నామిని పొలం మార్చుకొని అప్లై చేసుకొంటే వారు అర్హులుగా గుర్తిస్తారు.

Your PM Kisan-Annadata Sukhibhava Funds Haven t Credited Here s What to Check

ఈ సంవత్సరం మొదటి విడత విడుదల చేసినా కొందరికి నగదు జమ కాలేదు. వారి వివరాలు అనుమానస్పద ఉన్నాయని గుర్తించి అంటే ఒకే కుటుంబం లో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నారనే అనుమానంతో ప్రస్తుతానికి నగదు జమ చేయలేదు. వారికీ ఫీల్డ్ వెరిఫికేషన్ తరువాత వారికీ కూడా నగదు జమ అవుతాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్ దారులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, రాజ్యాంగబద్ద పదవులలో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+