రెండు పెళ్లిళ్లు.. బోలెడు ఎఫైర్స్: చదివింది ఆరే.. అమ్మాయిపై కన్నేస్తే అంతే!

Subscribe to Oneindia Telugu

అమలాపురం: చదివింది ఆరో తరగతి.. కానీ మోసాలు చేయడంలో మాత్రం పీహెచ్‌డీ చేశాడనే చెప్పాలి. స్వయంశక్తి అంటూ ఆదర్శాలు వల్లించడం.. బుట్టలో పడ్డ అమ్మాయిని పెళ్లి పేరుతో మోసం చేయడం అతగాని అలవాటు. అదొక్కటేనా.. ఉద్యోగాల పేరుతోనూ పలువురికి టోకరా వేశాడు. ఖరీదైన సెల్ ఫోన్లు దొంగిలించాడు. మాయ మాటలతో రెండు పెళ్లిళ్లు చేసుకోవడమే గాక.. మరో అమాయక విద్యార్థిని జీవితాన్ని నాశనం చేయబోయాడు. అతనే చోడె రమేష్..

ఎవరీ రమేష్..:

ఎవరీ రమేష్..:

తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడిలంక చోడే రమేష్ స్వగ్రామం. ఆరో తరగతి వరకు చదువుకున్న రమేష్.. స్థానికంగా ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాడు. ఆటో డ్రైవర్ కావడంతో.. తన ఆటోలో ఎక్కే కాలేజీ అమ్మాయిలతో మాటలు కలిపేవాడు. స్వయంశక్తితో బతకాలని విద్యార్థినులకు ఆదర్శాలు వల్లించేవాడు. తాను డిగ్రీ చదివినప్పటికీ.. ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో తాత్కాళికంగా ఆటో నడుపుతున్నట్టు చెప్పేవాడు.

రెండో పెళ్లి..:

రెండో పెళ్లి..:

చోడె రమేష్ మాయ మాటలకు రాజమహేంద్రవరానికి చెందిన ఓ అమ్మాయి మోసపోయింది. వీరిద్దరికి పెళ్లి కాగా.. తొమ్మిది నెలల కుమారుడు కూడా ఉన్నాడు. ఆమెతో వివాహ బంధాన్నికొనసాగిస్తూనే.. అమలాపురానికి చెందిన మరో యువతిని ఏడు నెలల క్రితం రమేష్ పెళ్లి చేసుకున్నాడు.

ఇంటర్ విద్యార్థినితో ఎఫైర్..:

ఇంటర్ విద్యార్థినితో ఎఫైర్..:

మొదటి భార్య ఉండగానే.. మరో అమ్మాయిని పెళ్లాడని రమేష్.. మరో ఇంటర్ విద్యార్థినితో సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో వ్యవహారం నడిపిస్తున్నాడు. అదే సమయంలో.. మరో అమలాపురం రూరల్ మండలానికి చెందిన మరో 10వ తరగతి బాలికనూ కూడా రమేష్ పెళ్లి పేరుతో మోసం చేశాడు.

పదో తరగతి బాలికపై అత్యాచారం.. ఇలా వెలుగులోకి:

పదో తరగతి బాలికపై అత్యాచారం.. ఇలా వెలుగులోకి:

గత జనవరి 2వ తేదీ నుంచి తమ కుమార్తె కనిపించకుండా పోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక పుస్తకాల్లో దొరికిన రెండు ఫోన్ నంబర్సే రమేష్‌ను పట్టించాయి. వాటి ఆధారంగా విచారించగా.. బాలికను రమేషే తీసుకెళ్లాడని తేలింది.

బాలికను ఓ దేవాలయం వద్దకు తీసుకెళ్లి.. ఇద్దరూ దండలు మార్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఆపై పెళ్లయిందని నమ్మించి.. అప్పటినుంచి బాలికపై రమేష్ అత్యాచారం చేస్తూ వస్తున్నాడని చెప్పారు.

రమేష్ నేరాల చిట్టా..:

రమేష్ నేరాల చిట్టా..:

రమేష్ పలువురి సెల్‌ఫోన్లు కూడా దొంగిలించాడని విచారణలో తేలింది. అలాగే తనకు తెలిసినవాళ్ల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రమేష్ నుంచి.. మరిన్ని నేరాల చిట్టా బయటపడే అవకాశముంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Amalapuram police on Monday arrested a auto driver for allegedly cheating three girls in the name of love.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి