ప్రేమ ఖైదీ విషాదం : పోలీసు స్టేషన్ లో ఆత్మ హత్య

Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లె పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు ప్రేమ విషయమై ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక గుడికాయల౦క చెందిన యువకుడు యరగళ్ల శ్రీనివాసరావు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.

బాలిక తల్లిదండ్రుల పిర్యాదు మేరకు డిసెంబర్ 31 న రేపల్లె లో పోలీస్ కేసు నమోదు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు.శ్రీనివాసరావు బంధువులు బాలికను బుధవారం పోలీసులకు అప్పగించారు. బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

 Youth commits suicide at repalle in Guntur district

శ్రీనివాసరావును గురువారం పోలీస్ స్టేషన్ కు బంధువులు తీసుకుని వచ్చారు.ఆ సమయంలో సీఐ, ఎస్సై,లు ట్రాఫిక్ డ్యూటీలో ఉండటంతో పోలీస్ స్టేషన్లో బంధువులతో వేచివున్న శ్రీనివాసరావు. బాత్రూమ్ కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు.

చాలాసేపటి కి బయటకు రాకపోవటంతో బంధువులు పోలీసులు బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా శ్రీనివాసరావు తాడుతో ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే శ్రీనివాసరావుని స్థానిక ప్రవేట్ హాస్పటల్ కు తరలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Youth Srinivas Rao commited suicide in Repalle police station in Guntur district of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి