టీ జాప్యం: యువకుడి ఆత్మహత్య, ప్రాణం విడిచిన తాత

సర్వాపూర్‌కు చెందిన గొడుగు కాశీరాం, లక్ష్మిల కుమారుడు సంజీవులు(26). ఆయనకు ఏడు నెలల క్రితమే పెళ్లయింది. కూలిపని చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తూ వస్తున్నాడు. గతంలో జరిగిన అన్ని ఉద్యమాల్లో చురుగ్గా పాలు పంచుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్బంగా మంగళవారం ఉదయం ఇంటి ముందు తెలంగాణ ఆకారంలో తోరణాలు కట్టి, ఇంటి ఎదుట 'జై తెలంగాణ' అని ముగ్గుతో తీర్చిదిద్దాడు. ఆ రాత్రంతా స్నేహితులతో తెలంగాణ గురించే మాట్లాడాడు.
తెలంగాణ రాదేమోనన్న నిర్వేదంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి 12గంటల సమయంలో గ్రామంలోని వాటర్ ట్యాంక్‌కు వేలాడుతున్న సంజీవుని మృతదేహాన్ని అటుగా వచ్చిన ప్రజలు గమనించి కిందకు దించారు. బుధవారం ఉదయం గ్రామస్థులు గ్రామ ప్రధాన రహదారి ఎదుట ధర్నాకు దిగారు. ఆయన మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని నినదించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి, బాన్సువాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి గ్రామానికి చేరుకొని మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు. నాయకుల పరామర్శ సాగుతుండగానే సంజీవులు తాతయ్య గోధూరి కోటయ్య(65) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు.












Click it and Unblock the Notifications