మితిమీరిన సాధన: జిమ్‌లో కూలి యువకుడి మృతి
హైదరాబాద్: ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్లిన ఓ యువకుడు సాధన చేస్తూ జిమ్‌లోనే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటన హైదరాబపాదులోని అల్కాపురి చౌరస్తాలో ఆదివారంనాడు చోటు చేసుకుంది. వనస్థలిపురం, పనామా గోదాముల వద్ద నివాసముంటున్న గంజి వాసు (23) తండ్రితో కలిసి వ్యాపారం చేస్తుంటాడు. కొన్నాళ్లుగా జిమ్ సెంటర్లకు వెళ్లి దేహదారుఢ్యం కోసం సాధన చేస్తున్నాడు.
అల్కాపురి చౌరస్తా సమీపంలోని 'ఓడ్‌సాలిడ్ ఫిట్‌నెస్ ప్రైవేటు లిమిటెడ్'లో గత నెల 11న సభ్యత్వం తీసుకుని సాధన చేస్తు్నాడు రోజూ మధ్యాహ్నం సాధన చేసేందుకు అక్కడికి వెళ్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫిట్‌నెస్ కేంద్రానికి వెళ్ళి 2.40 గంటల వరకు సాధన చేశాడు. ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేస్తూనే కుప్పకూలాడు.

అధిక సాధన చేయటం ద్వారా తీవ్రంగా నీరసించి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో గుండెపోటు వచ్చి ఉంటుందా అనే సందేహాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమమంలో సెంటర్ నిర్వాహకులు, సిబ్బంది ఎవరూ లేకపోవటంతో దాదాపు 10 నిమిషాల పాటు కిందపడి కొట్టుకుంటూ మృత్యువాత పడ్డాడు.
ఫిట్‌నెస్ కేంద్రంలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మాత్రమే సాధన చేయటానికి అనుమతి ఉంది. ఆ సమయంలో చాలామంది యువకులు వచ్చి సాధన చేసి వెళ్లిపోయారు. వాసు మాత్రం అక్కడే ఉండి సాధన చేస్తూనే ఉన్నాడు. నిర్వాహకులు అతన్ని వారించకపోవటంతో ఎక్కువసేపు సాధన చేస్తూ తీవ్రంగా నీరసించి మృతి చెందాడని తెలుస్తోంది. వాసు సాధన చేస్తూ.. హాలులో కుప్పకూలిన సమయంలో ఫిట్‌నెస్ సెంటర్ సిబ్బంది ఎవరూ లేకపోవటంతో అతను 10 నిమిషాల పాటు తల్లడిల్లి చనిపోయినట్టు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా తెలుస్తోంది.
అతను కిందపడిపోయిన అరగంట తరువాత రిసెప్షన్‌లో ఉన్న సుధాకర్ వచ్చి చూశాడు. వాసు చనిపోయాడని తెలుసుకొని ఫిట్‌నెస్ సెంటర్ యజమానికి తెలియజేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫిట్‌నెస్ సెంటర్ వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. వాసు నీరసంతో కిందపడిపోగానే సిబ్బంది చూసి ఉంటే ప్రాణాలతో బయటపడేవాడని తండ్రి అంటున్నాడు. ఫిట్‌నెస్ సెంటర్‌లో ఎప్పుడూ పరిశీలకులు, శిక్షకులు ఉండాలని, కానీ వారు అందుబాటులో లేకపోవటంతోనే వాసు మృతి చెందాడని తెలుస్తోందని ఆయన అంటున్నారు.












Click it and Unblock the Notifications