క్రికెట్ కోసం ఘర్షణ, ఒకరి మృతి: మరో ఘటనలో రివాల్వర్‌తో కాల్చుకొని..

ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోటు చోసుకుంది.

తణుకు: ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోటు చోసుకుంది. స్థానికంగా ఉండే సందీప్ (17) అక్కడి సామాజిక భవనం వద్ద తోటివారితో కలిసి క్రికెట్‌ ఆడుతున్నాడు.

హరిశ్చంద్ర అనే యువకుడు అక్కడకు వచ్చాడు. తాను కూడా ఆడతానని అడిగాడు. సందీప్ నిరాకరించడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పెనుగులాట చోటు చేసుకుంది.

ఈ ఘటనలో సందీప్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే లోపు మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.

death

కర్నూలులో రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం

కర్నూలు నగర శివారులోని స్టాంటన్‌పురానికి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల సుచరిత రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సుచరిత తండ్రి ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందారు.

ఆ తర్వాత 0.32 రివాల్వర్‌, 6 బుల్లెట్లు ఆయుధ అనుమతి పొందాడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. తల్లి ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నారు.

ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసిన సుచరిత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్‌ 2 పరీక్ష సరిగా రాయకపోవడంతో మనస్థాపానికి గురైనట్లుగా తెలుస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం విధుల నుంచి వచ్చిన తండ్రి తన రివాల్వర్‌ పక్కన ఉంచి హాల్‌లో నిద్రపోయాడు. అక్కడే ఉన్న సుచరిత తండ్రి రివాల్వర్‌ను తలకు గురిపెట్టుకుని కాల్చుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కూతురిని చూసి తండ్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+