పెళ్లి చేసుకోవాలని కూతురు వరస అమ్మాయికి వేధింపు

Youth force girl to marriage
హైదరాబాద్: వరసకు కూతురైన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్న వ్యక్తి పైన పోలీసులు నిర్భయ కేసును నమోదు చేశారు. అతనిని రిమాండుకు తరలించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడలో ఉంటున్న రవి అనే 29 ఏళ్ల వ్యక్తి స్టీల్ సామాను వ్యాపారం చేస్తున్నాడు. అతనికి కూతురు వరసయ్యే బిఎస్సీ విద్యార్థిని సెలవులు ఉండటంతో గత నెలలో వీరి ఇంటికి వచ్చింది. ఈమె రవి భార్య అక్క కూతురు.

ఆమె వచ్చినప్పటి నుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ రవి వేధించసాగాడు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆమె ఎవరికీ చెప్పలేదు. గత నెల 12వ తేదీన ఆమె చదివే కాలేజీకి వెళ్లి గొడవ చేశాడు. ఆమె ఇంట్లో విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. రవిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

కాగా, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాఫ్టువేర్ ఇంజనీర్ అభయ పైన అత్యాచారం కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. గత అక్టోబర్ 18న రాత్రి మాదాపూర్లో బాధితురాలిని అపహరించిన వెంకటేశ్వర్లు, సతీష్ అనే క్యాబ్ డ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో వాదనలు ముగిశాయి. బుధవారం తీర్పు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+