అందరూ చూస్తుండగా హత్య: మాటు వేసి 15 చోట్ల కత్తిపోట్లు

Subscribe to Oneindia Telugu

కొవ్వూరు: కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌.. సమయం బుధవారం సాయంత్రం నాలుగు గంటలు.. ముగ్గురు వ్యక్తులు కత్తులతో మాటు వేశారు. అందరూ చూస్తుండగా.. ఓ యువకుడితో ఘర్షణపడి.. అత్యంత పాశవికంగా 15చోట్ల కత్తులతో నరికి పరారయ్యారు.

రక్తపు మడుగులో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన జనం తేరుకునేందుకు చాలా సమయమే పట్టింది. హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు: పాతకక్ష్యల నేపథ్యంలో పట్టపగలు నడి రోడ్డుపై ఒక యువకుడిని అత్యంత క్రూరంగా నరికి చంపారు.

Youth stabbed to death in broad day light

ఈ సంఘటన ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే కొవ్వూరు పట్టణంలో సంచలనం కలిగించింది. స్థానిక 3వ వార్డు క్రిస్టియన్‌ పేటకు చెందిన గంధం బుజ్జిబాబు(20) రాడ్‌ బెండింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఇంట్లో పడుకుని ఉన్న బుజ్జిబాబును అతని స్నేహితులు పి.పండు, మరొకరు కలిసి 3.30 గంటలకు బయటకు తీసుకొచ్చారు.

మార్గమధ్యలో ఇద్దరు స్నేహితులు బయటకు వెళ్లడంతో బుజ్జిబాబు ఆర్‌టీసీ బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న వేరొక వర్గం బుజ్జిబాబుతో ఘర్షణకు దిగారు. సుమారు అరగంట సేపు వారి మధ్య వాగ్వాదం సాగింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man has been shot dead in broad day light at Kovvuru in Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి