Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబు ఇలాకాలో జగన్‌‍కు పట్టం, తదేకంగా రోజా(పిక్చర్స్)

చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం జిల్లాలో తన సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్రను రెండో రోజైన ఆదివారం ప్రారంభం కానుంది. శనివారం ఆయన యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం దాదాపు రెండుగంటలు ఆలస్యంగా 5.45 నిమిషాలకు జగన్ కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ విగ్రహాలను ఆవిష్కరించారు. సమైక్యాంధ్రకు మద్దతిచ్చే వారిని ప్రధానిని చేద్దామని, ప్రధానమంత్రి అభ్యర్థి అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 2014 ఎన్నికల తర్వాత కీరోల్‌గా మారనుందన్నారు.

అనంతరం కుప్పం బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభలో జగన్ ఆద్యంతం ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. రాయలసీమ రతనాల సీమ అని తన ప్రసంగాన్ని ప్రారంభించిన జగన్, చిత్తూరు జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు, కాణిపాకం వినాయకుడు, ముక్కంటేశ్వరుడు కొలువుదీరివున్న పవిత్ర పుణ్యక్షేత్రమన్నారు.

అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఇక్కడి నుండే సమైక్య శంకారావాన్ని నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. తాను కుప్పం పర్యటనకు వస్తున్నానని తెలిసి ఆయన సభలకు వెళ్లొద్దని టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం ప్రజలకు పిలుపుఇచ్చినట్టు తెలిసిందని, అయితే తాను వచ్చానన్న సంగతి తెలిసి ఇళ్లకు తాళాలు వేసుకుని, షాపులు మూసి తన సభకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యారన్నారు. దీన్నిబట్టి ఇది ఎవరి కోసమో ఇపుడైనా ఆయన అర్థం చేసుకోవాలన్నారు.

జగన్ 1

జగన్ 1

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఓ కుటుంబాన్ని ఓదార్చుతున్న దృశ్యం.

జగన్ 2

జగన్ 2

జగన్ తన యాత్రలో రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యంగా సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు తెగబడుతున్నారన్నారని, ఈ వాస్తవం తెలిసి కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్‌కు తెరవెనుక మద్దతిస్తూ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

జగన్ 3

జగన్ 3

తెలుగువారి ఆత్మగౌరవాన్ని సోనియా పాదాలముందు బాబు తాకట్టు పెట్టారని, బాబుకు చిత్తశుద్ధి వుంటే ఇప్పటికైనా విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బాబు 4

బాబు 4

ఢిల్లీలో బాబు దీక్షలకు పూనుకుంటే, కిరణ్ హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగుల చేత సమ్మె విరమింప చేయించారన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కిరణ్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెడితే రెండుకళ్ల సిద్ధాంతం అన్న బాబు పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

జగన్ 5

జగన్ 5

పరస్పరం కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ అదేమంటే తనపై ఆరోపణలు చేయడం చంద్రబాబు రాజకీయ అనైతికతకు నిదర్శనమన్నారు. కర్నాటక, మహారాష్టల్రో డ్యాములు నిండితేనే గాలేరు నగరికి నీళ్లు వస్తాయన్నారు. అలా ఆధారపడి జీవించాల్సిన పరిస్థితిలో ఉన్నామన్నారు.

జగన్ 6

జగన్ 6

రాష్ట్రం విడిపోతే కుప్పం నుండి శ్రీకాకుళం వరకు చుక్క నీరు లభించడం దుర్లభమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రం ఏర్పడితే మన నీటి కోసం మనం తన్నుకుచావాలన్నారు.

జగన్ 7

జగన్ 7

పదేళ్లలో హైదరాబాద్ వదిలి వెళ్లాలని పాలకులు నిర్దేశిస్తున్నారన్నారు. చదువుకున్న సీమాంధ్ర విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని తాను సోనియాగాంధీని, కిరణ్‌కుమార్ రెడ్డిని, చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారన్నారు.

జగన్ 8

జగన్ 8

బూర్గుల రామకృష్ణారావు విశాలాంధ్ర కోసం 1957లో పోరాటం చేసిన విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక శాతం తెలుగుమాట్లాడే వారే ఎక్కువన్నారు. ఇంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని విభజించడానికి సోనియా తెగబడుతున్నారన్నారు.

జగన్ 9

జగన్ 9

చరిత్ర తెలియనివారు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30ఏళ్ల క్రితం భారతదేశ పౌరసత్వాన్ని పొందిన సోనియా, దేశం వదిలి వెళ్లాలని పార్లమెంటులో తీర్మానిస్తే జీర్ణించుకోగలరా? అని ప్రశ్నించారు.

జగన్ 10

జగన్ 10

అలాంటప్పుడు 60 ఏళ్లుగా కలిసిమెలిసి ఉన్న తెలుగువారిని విడదీస్తే తాము ఊరుకుంటారని ఎలా భావిస్తున్నారని ప్రశ్నించారు. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిగా చేద్దామని జగన్ అనడంతో సభలోని ప్రజలు ఆయనకు మద్దతు పలుకుతూ నినాదాలు చేశారు.

జగన్ 11

జగన్ 11

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాను ఉత్తర భారతదేశంలోని జాతీయ నాయకులందరినీ కలిసి ఒప్పిస్తున్నారన్నారు. ఆ పని చంద్రబాబు ఎందుకు చేయలేక పోతున్నారని ప్రశ్నించారు.

జగన్ 12

జగన్ 12

హైదరాబాద్‌ను సీమాంధ్రకు దూరంచేస్తే అక్కడ కోల్పోతున్న ఆస్తులను సోనియా, చంద్రబాబు, కిరణ్ ఇస్తారా? అని ప్రశ్నించారు. చీకట్లో కాంగ్రెస్ కేంద్రమంత్రి చిదంబరాన్ని కలిసొస్తున్న బాబు కుమ్మక్కు రాజకీయాలు మాట్లాడడం ఆయన దిగజారుడికి నిదర్శనమన్నారు. కాగా, పర్యటనలో రోజా కూడా పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+