పాదయాత్ర చేస్తే కానీ తెలియలేదా ? లోకేష్ వ్యాఖ్యలపై అవినాష్ రెడ్డి ఫైర్..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రాయలసీమలో యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో మంటపుట్టించాయి. వైసీపీ ఎమ్మెల్యేల్ని టార్గెట్ చేస్తూ రాయలసీమలో యాత్ర సాగించిన లోకేష్.. చివర్లో తానూ రాయలసీమ వాసినేనంటూ చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు.
లోకేష్ పాదయాత్రపై కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర, అందులో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ అవినాష్ రెడ్డి..రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప లోకేష్ కు తాను ఈ ప్రాంత వాసినని తెలీదా..? అని ప్రశ్నించారు. తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని అధికార పార్టీపై లోకేష్ అబద్ధాలు, అసత్యాలు చెబుతున్నాడని అవినాష్ విమర్శించారు.

14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు గుర్తుకు రాని రాయలసీమ ఇప్పుడే గుర్తు కొచ్చిందా అని లోకేష్ ను అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. లోకేష్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తద్వారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన రాయలసీమ టచ్ ను అవినాష్ టార్గెట్ చేశారు. ఇప్పటికే రాయలసీమలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా తమపై చేసిన విమర్శల్ని స్ధానిక వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు కౌంటర్ చేశారు. ఇప్పుడు చివరిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫైనల్ టచ్ అన్నట్లుగా లోకేష్ వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడుతూ ఫైర అయ్యారు.












Click it and Unblock the Notifications