Chebrolu Kiran: తీవ్ర ఇబ్బందుల్లో చేబ్రోలు కిరణ్ ఫ్యామిలీ- విరాళాలకు టీడీపీ నేతల ట్వీట్లు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని దారుణంగా దూషించిన కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ తో పాటు ఆయన కుటుంబం కూడా కష్టాల్లో ఉంది. ఆయన కుటుంబ ఆర్దిక పరిస్ధితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ అయి ఇంట్లో మంచానికే పరిమితమైన నాన్న, పనికి వెళ్లలేక ఇబ్బందుల్లో ఉన్న అమ్మ.. ఇలా పలు రకాలుగా కుటుంబం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా పోలీసులతో కేసు కూడా పెట్టించింది. ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడేందుకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్ధితుల్లో ఉన్న చేబ్రోలు కిరణ్ కు కుటుంబాన్ని పట్టించుకునే పరిస్ధితి లేదు. దీంతో తిరిగి టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. చేబ్రోలు కిరణ్ కుటుంబ ఆర్దిక పరిస్ధితిని వివరిస్తూ ఫొటోలు, పోస్టులు పెడుతున్నారు..

కిరణ్ మాట్లాడిన మాటలు తప్పే ..కానీ, ఈరోజు తన ఫ్యామిలీని చూస్తుంటే, ఎలాంటి వాతావరణం లో పెరిగినాడో అర్ధం అవుతుంది.
— Venugopalreddy Chenchu (NRITDP Spokesperson) (@venuchenchu) April 11, 2025
యాక్సిడెంట్ జరిగి మంచాన పడి, కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఈ పెద్దాయనకు, వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాల్సిన సమయం. మా మా NRI మిత్రుల సహకారంతో NRI TDP (USA) తరుపున… pic.twitter.com/6pKURErxAt
అంతే కాదు చేబ్రోలు కిరణ్ ఆవేశంలో తప్పు చేశాడని సమర్ధిస్తున్నారు. ఆ తప్పు కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబం సమస్యలు ఎదుర్కోవడం సరికాదని చెప్తున్నారు. ఇదే కారణంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. అలాగే ఆయన తల్లి బ్యాంక్ పాస్ బుక్, అకౌంట్ వివరాలను కూడా షేర్ చేసి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో టీడీపీ ఎన్నారై విభాగం లక్ష రూపాయలు విరాళంగా కూడా ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు కూడా పెట్టారు. దీంతో టీడీపీ సస్పెండ్ చేసిన చేబ్రోలు కిరణ్ పై పార్టీ నేతల్లో అభిమానం అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.
మనలో ఒకడు… మన అందరిలో ఒక్కడు చేబ్రోలు కిరణ్….
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@Shiva4TDP) April 11, 2025
ఆయన్ని అరెస్ట్ చేస్తే మనల్ని చేసినట్టే….
వాళ్ల ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేదు… మన తల్లి తండ్రుల లాంటి వాళ్ళు దయచేసి సహాయం చేయండి 🙏🙏🙏 pic.twitter.com/hPkzVU8sqZ












Click it and Unblock the Notifications