బాబు దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారు: జగన్ (ఫొటోలు)
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే సాక్షాత్తూ దగ్గరుండి తమ పార్టీ నేతలను హత్యలు చేయిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఏకపక్షంగా జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
అనంతపురం జైల్లో ఉన్న పార్టీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. హత్యలు చేసిన వాళ్లను వదిలేసి, ఎమ్మార్వో కార్యాలయాన్ని ధ్వంసం చేశారంటూ గుర్నాథరెడ్డితో పాటు మరో 40మందిని అరెస్ట్ చేయటం అన్యాయమన్నారు.
ఎమ్మార్వో కార్యాలయాన్నే హత్యా వేదికగా మార్చుకుని, ప్రభుత్వ ఉద్యోగులే ఈ ఘటనల్లో ప్రమేయం ఉండటం దారుణమన్నారు. అనంతపురం జిల్లాలో భూమిరెడ్డి ప్రసాదరెడ్డి హత్య మొదటిది కాదని, గతంలోనూ విజయ్ భాస్కర్ అనే వ్యక్తిని సింగిల్ విండో కార్యాలయానికి పిలిచి రాజీనామా చేయాలని సీఈవో స్వయంగా ఫోన్ చేశారని, అయితే అందుకు నిరాకరించిన విజయ్ భాస్కర్‌ను దారుణంగా హతమార్చారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
భావోద్వేగానికి లోనై ప్రవర్తిస్తే రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అని కూడా చూడకుండా జైల్లో పెట్టారని ఆయన అన్నారు. ఇటువంటి అన్యాయం ఎవరికైనా, ఎప్పుడైనా జరుగుతుందని ప్రజాస్వామ్యంలో మీడియా తన వంతు బాధ్యతగా గళం విప్పాలని వైఎస్ జగన్ కోరారు.

అనంతపురంలో జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అనంతపురం వచ్చారు.

నేతలకు పరామర్శ
అనంతపురం జైలులో ఉన్న పార్టీ నాయకుడు గుర్నాథ్ రెడ్డిని వైయస్ జగన్ సోమవారంనాడు పరామర్శించారు.

బాబుపై విమర్స
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే తమ పార్టీ నాయకుల హత్యలు జరుగుతున్నాయని జగన్ విమర్శించారు.

ప్రసాద రెడ్డికి నివాళి
ఇటీవల ఎమ్మార్వో కార్యాలయంలో హత్యకు గురైన పార్టీ నాయకుడు ప్రసాద్ రెడ్డికి జగన్ నివాళి అర్పించారు.

కుటుంబ సభ్యులకు పరామర్శ
హత్యకు గురైన ప్రసాద రెడ్డి కుటుంబ సభ్యులను వైయస్ జగన్ సోమవారంనాడు పరామర్శించారు.

అగ్రిగోల్డ్ బాధితుల వినతి
అగ్రి గోల్డ్ బాధితులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనంతపురంలో వినతిపత్రం సమర్పించారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications