షాకులు ఇవ్వటంలో వైఎస్ జగన్, కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే.. తగ్గేదేలే!!

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. చాలా విషయాల్లో ఇద్దరు ఒకే విధంగా రియాక్ట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సొంత పార్టీ నేతలపై ఇద్దరి వ్యవహారశైలి దాదాపు ఒకే విధంగా ఉన్నట్లుగా తాజా రాజకీయ పరిణామాలతో అర్థమవుతుంది. ఇంతకీ సీఎం కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒకే విధంగా తీసుకుంటున్న ఆ నిర్ణయాలు ఏమిటి? ఎందుకు ఇద్దరూ ఒకటే అన్న చర్చ జరుగుతుంది అన్న విషయానికి వస్తే..

ఆనం వ్యాఖ్యలతో జగన్ షాకింగ్ నిర్ణయం

ఆనం వ్యాఖ్యలతో జగన్ షాకింగ్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒకవేళ అలా ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమని ఆనం రామనారాయణ రెడ్డి బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు.

వెంకటగిరి నియోజక వర్గ ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ .. ఆనంకు సైలెంట్ షాక్

వెంకటగిరి నియోజక వర్గ ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ .. ఆనంకు సైలెంట్ షాక్

ఇక సైదాపురం మండలం లో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఏం పని చేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలి అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన వ్యాఖ్యలతో సైలెంట్ గా ఆయనకు షాక్ ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి ఇంఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. దీంతో సైలెంట్ గా పొమ్మనకుండా పొగ పెట్టారు.

తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొంగులేటి వ్యాఖ్యలు

తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొంగులేటి వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సైలెంట్ గా నే టార్గెట్ చేశారు. కొద్ది రోజుల క్రితం తన అనుచరులతో సమావేశం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు. అయితే ఏ పార్టీ నుంచి అనేది మాత్రం ఇంకా ఇప్పుడే చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు లభిస్తుంది ఏమిటి అన్న విషయాన్ని అందరూ చూస్తూనే ఉన్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 భద్రత తగ్గించి సైలెంట్ షాకిచ్చిన కేసీఆర్

భద్రత తగ్గించి సైలెంట్ షాకిచ్చిన కేసీఆర్

పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పార్టీ మారతారా మన సంగీతాన్ని సూచించడంతో సైలెంట్ గా స్టెప్ వేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి త్రీ ప్లస్ త్రీ భద్రతను టు ప్లస్ టు కి తగ్గించి ప్రస్తుతం ఆయనకు కొనసాగిస్తున్నటువంటి ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించారు. ఉన్నట్టుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఈ నిర్ణయం తీసుకోవడం ఆయనకు కూడా పొమ్మనకుండా పొగ పెట్టడమే అని చర్చ జరుగుతుంది.

ఇద్దరు సీఎంలు సేమ్ టూ సేమ్

ఇద్దరు సీఎంలు సేమ్ టూ సేమ్


మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నటువంటి నాయకులకు చెక్ పెట్టడంతో ఈ విషయంలో కెసిఆర్, జగన్ ఇద్దరూ ఒకటే అన్న చర్చ జరుగుతుంది. సొంత పార్టీ నేతలను కట్టడి చేయడానికి నోటితో చెప్పకుండా చేతల్లో చూపించిన ఇరువురు నేతల తీరును ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొన్న జగన్ తీసుకున్న నిర్ణయమే నిన్న కేసీఆర్ కూడా తీసుకోవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+