ఒకే వేదికపై జగన్, షర్మిల - ఏం జరుగుతోంది..!!

మాజీ సీఎం జగన్..పీసీసీ చీఫ్ షర్మిల ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. కొంత కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజా ఎన్నికల్లో జగన్ పరాజయం కోసం షర్మిల పని చేసారు. కడప నుంచి ఎంపీ గా పోటీ చేసిన షర్మిల పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఇద్దరూ ఈ రోజు ఇడుపులపాయలోనే బస చేయనున్నారు. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిన వేళ మరోసారి ఇద్దరూ ఒకే వేదిక మీదకు రానుండటం రాజకీయం గా ఆసక్తి కరంగా మారుతోంది.

పులివెందులలో జగన్
వైఎస్ జగన్ ప్రస్తుతం పులివెందులలో ఉన్నారు. బెంగళూరు నుంచి శనివారం జగన్ కడప చేరుకున్నారు. కడపలో జగన్ కు ఘన స్వాగతం లభించింది. పెండ్లిమర్రి మండలం మాచనూరుకి వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు మాచనూరి చంద్రా రెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన అక్కడే కొంత సమయం గడిపి తర్వాత గొందిపల్లి చేరుకొని కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె వివాహం ఇటీవల జరిగింది. కొత్త దంపతులను జగన్ ఆశీర్వదించారు.

YS Jagan and YS Sharmila to pay tributes for YSR at Idupupalya on Monday

ఇడుపులపాయకు షర్మిల
ఆ తరువాత జగన్ పులివెందుల చేరుకున్నారు. జగన్ ను జిల్లాకు చెందిన పార్టీ నేతలు..కార్యకర్తలు..అభిమానులు కలుసుకున్నారు. ఈ సాయంత్రం జగన్ ఇడుపులపాయ చేరుకుంటారు. ఇదే సమయానికి షర్మిల సైతం రాత్రికి ఇడుపులసపాయు చేరుకోనున్నారు. రేపు(సోమవారం) వైఎస్సార్ వర్దంతి. జగన్, షర్మిల ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ కు నివాళి అర్పించనున్నారు. ఇద్దరూ వేర్వేరుగానే నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ ఏడాది జూలై 8న వైఎస్సార్ జయంతి వేడుకల్లోనూ ఇద్దరూ వేర్వేరుగా హాజరయ్యారు.

వైఎస్సార్ కు నివాళి
జూలై 8న ముందుగా జగన్ తన తండ్రికి నివాళి అర్పించారు. ఆ సమయంలో విజయమ్మ ఉన్నారు. ఆ తరువాత అక్కడకు చేరుకున్న షర్మిల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి...ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ సైతం హాజరయ్యారు. ఇప్పుడు సైతం అదే విధంగా ఇద్దరూ ఎవరికి వారుగానే నివాళి కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు. అయితే, ఇద్దరి మధ్య రాజీ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయనే చర్చ రాజకీయంగా వినిపిస్తోంది. దీంతో, ఇడుపుల పాయలో చోటు చేసుకొనే పరిణామాల పైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+