వైసీపీలో జగన్ కీలక నియామకాలు-పొన్నవోలుకు కీలక పదవి..!
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నేతల వలసల నేపథ్యంలో అధినేత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీని క్షేత్రస్దాయి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ఇవాళ మరికొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఇందులో జిల్లా అధ్యక్షుల మార్పులు సహా పలు నియామకాలు ఉన్నాయి. అలాగే మాజీ అదనపు అడ్వకేటా్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ప్రమోషన్ కూడా లభించింది.
వైసీపీ అధినేత జగన్ కు సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్ ను నియమించారు. అలాగే పెనమలూరుకు చెందిన వేణుగోపాల్ కృష్ణమూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అటు వైసీపీ హయాంలో అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే వైసీపీలో 41 అనుబంధ విభాగాలకు అధ్యక్షుల్ని కూడా నియమిస్తూ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డిని నియమించారు. అలాగే నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని నియమిస్తూ జగన్ మరో ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో వైసీపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న ఈ నియామకాలతో పార్టీలో జవసత్వాలు నింపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఐదేళ్ల పాటు పార్టీని నిలబెడతారని భావిస్తున్న, ఆర్ధికంగా బలవంతులైన వారిని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కూటమి ప్రభుత్వంతో సై అంటే సై అనే నేతలను జగన్ ఎంపిక చేస్తున్నారు. తద్వారా ఐదేళ్ల పాటు క్యాడర్ లోనూ పాజిటివ్ ఫీల్ నిలబెట్టాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications