YS Jagan: అసెంబ్లీలో లడ్డూ చర్చ వేళ జగన్ అనూహ్య నిర్ణయం..!
ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వివాదంపై దర్యాప్తు జరిపిన సుప్రీంకోర్టు సిట్ ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. దీనిపై సంతృప్తి చెందని ప్రభుత్వం.. ఏకసభ్య కమిటీని నియమించింది. దీనిపై బీజేపీ మాజీ సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో తమ పైచేయి చాటుకునేందుకు ప్రభుత్వం రేపు అసెంబ్లీలో నెయ్యి చర్చ పెట్టింది.
రేపు అసెంబ్లీలో తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వైఎస్ జగన్ రూటు మార్చారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటించాలని వైఎస్ జగన్ (ys jagan) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రేపు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో జగన్ ప్రజాదర్భార్ నిర్వహిస్తారని, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారని తెలిపింది.

అలాగే ఎల్లుండి ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారని, అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారని, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారని వెల్లడించాయి.












Click it and Unblock the Notifications