వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసానికి సహకరించాలంటూ పార్టీలతో జగన్ మంతనాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రత్యేక హోదా విషయమై కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు ట్బిట్టర్‌లో వైఎస్ జగన్ ఆయా పార్టీలను కోరారు.

మంగళవారం నాడు ఉదయం ఆయా పార్టీలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలతో వైఎస్ జగన్ ఫోన్‌లో మాట్లాడారు. అంతేకాదు పార్టీలతో జగన్ ఫోన్ లో మాట్లాడారు.

Ys Jagan appeals to all parties to cooperate no confidence motion

అవిశ్వాసానికి సహకరించాలని కోరారు. అయితే మంగళవారం నాడు పార్లమెంట్‌లో తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా చూడాలని స్పీకర్ సుమిత్రా మహజన్‌ను కలవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారు.

మరో వైపు అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా సహకరించాలని పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్న పార్టీలను కూడ వైసీపీ ఎంపీలు కోరనున్నారు. అన్నాడిఎంకె, టిఆర్ఎస్ ఎంపీలు తమ రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నాయి.

అయితే అవిశ్వాసానికి సహకరించాలని ఈ రెండు పార్టీలను మరోసారి కోరాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పలు పార్టీల మద్దతును వైసీపీ కూడగడుతోంది.

English summary
Ysrcp chief Ys Jagan appealed to all parties to cooperate no confidence motion in parliament. Jagan spoke to various party leaders over phone on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X