ఏపీ తాత్కాలిక సీఎస్ గా విజయానంద్-ఆస్పత్రిలో సీఎస్ సమీర్ శర్మ
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అస్వస్ధతకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం ఆయన స్ధానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ సమీర్ శర్మ అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో విజయానంద్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డా.సమీర్ శర్మ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటే త్వరలో ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పినట్లు ప్రభుత్వం తెలిపింది. అనంరం ఆయన విధుల్లో చేరే అవకాశం ఉంది.

వాస్తవానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డా.సమీర్ శర్మ అశ్వస్థతకు గురి కాగానే స్థానిక ఆసుపత్రిలో చేరి ప్రాధమిక చికిత్స చేయించుకున్నారు.మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆయన హైదరాబాదులోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చేరగా గుండె సంబంధిత చికిత్స జరిగింది.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఆరోగ్యం కుదిపడిన పిమ్మట సిఎస్.డా.సమీర్ శర్మ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయి త్వరలో విధుల్లో చేరనున్నారు. అయితే ఆలోపు పాలనకు ఇబ్బంది లేకుండా విజయానంద్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.












Click it and Unblock the Notifications