బీజేపీ రాయబారంతో వచ్చాం: జగన్, ఎందుకో: బాబు, విభజనపై..

హైదరాబాద్: తాము శాసన సభకు రావడానికి భారతీయ జనతా పార్టీ రాయబారం చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అన్నారు. విద్యుత్ పెంపు పైన చంద్రబాబు చేసింది ప్రకటన కాదని, ప్రసంగమని ఎద్దేవా చేశారు.

సభలో తాను ఏం మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడుతున్నానని చెప్పారు. విద్యుత్ విషయంలో ప్రజల పైన వెయ్యి కోట్ల భారం మోపుతున్నారనే తాము నిలదీసేందుకు సభకు వచ్చామన్నారు. బస్సుయాత్రను తాముతాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.

ఎందుకొచ్చారో.. ఎందుకెళ్లారో: చంద్రబాబు

YS Jagan blames Chandrababu for power hike

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాసన సభకు ఎందుకు వచ్చారో.. ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎప్పుడు తాను ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటానని చెప్పారు. తాము సభలో మాట్లాడాం కాబట్టి ఇక వెళ్లిపోతామనే ధోరణి వైసీపీలో కనిపించిందన్నారు. తాము ప్రజల కోసం పని చేస్తున్నాం తప్పితే ప్రతిపక్షం కోసం కాదన్నారు.

రాష్ట్ర విభజనలో హేతుబద్దత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లెవల్ ప్లెయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు కేంద్రం సహకరించాలన్నారు. విభజనతో ఏపీ వెనుకబడిందని కేంద్రం ఏపీని ఆదుకోవాలన్నారు. ప్రజధనాన్ని దుర్వినియోగం తాము ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయమన్నారు. రాజధాని, రైతు, డ్వాక్రా రుణ మాఫీపై దృష్టి సారించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+