అమ్మో! నవ్వుతూ ఎమ్మెల్యేలను లాక్కున్నారు: కేసీఆర్‌పై జగన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ సఖ్యతగా ఉంటూ.. నవ్వుతూనే పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న ఒక్కరూ సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.
పెన్షన్ వెయ్యి రూపాయలు అంటూనే మరోవైపు ఎక్కువమందిని తొలగించిన అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని సూచించారు. రూ.500 కోట్లిచ్చామని చెబుతున్నా వాస్తవంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించాలన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై తెరాసలో చేరిన ఎమ్మెల్యేల పైన కోర్టును ఆశ్రయించాలని వైసీపీ నిర్ణయించింది. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశించాలంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించనుంది.












Click it and Unblock the Notifications