పద్ధతి మార్చుకో, నెల రోజులు ఆగు: జగన్‌కు లోకేష్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆదివారం అన్నారు. ప్రజల కోసం, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం టిడిపి శాయశక్తులా కృషి చేస్తుందన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు విమర్శిస్తే బాగుంటుందన్నారు. కనీసం ఒక నెల రోజులయినా జగన్ ఓపిక పట్టాలని సూచించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పేదోడీ ఇంట్లో పెళ్లి లాంటిదని లోకేష్ శనివారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు అన్నారు.

విజయవాడ - గుంటూరులు జంట నగరాలుగా అభివృద్ధి: వెంకయ్య
విజయవాడ - గుంటూరు నగరాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. హైదరాబాద్ తరహా కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. విశాఖ ప్రజలు ధనం, వారసత్వాలను పక్కన పెట్టి ప్రతిభకు పట్టం కట్టారన్నారు. చంద్రబాబును ప్రజల కష్టాలను తెలుసుకునే నేతగా ప్రశంసించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. లోకసభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇచ్చే విషయమై చర్చిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలన్నదే తమ విధానమన్నారు. ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి ఇవ్వాలన్నది స్పీకర్ నిర్ణయమని చెప్పారు. రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులోని ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు.












Click it and Unblock the Notifications