వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో తగ్గుతున్న వ్యూహకర్తల హవా-ఒక్కొక్కరుగా మాయం- నేతలకు ఇక సొంత వ్యూహాలే గతి

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో 2016 తర్వాత రాజకీయ వ్యూహకర్తల హవా మొదలైంది. 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీని ప్రధాని పీఠంపై కూర్చుబెట్టడంలో ప్రశాంత్ కిషోర్ పోషించిన పాత్ర.. అప్పట్లో ఏపీలో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ను ఆకర్షించింది. అంతే 2019 ఎన్నికలకు పీకే వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా మారిపోయారు. అప్పట్లో పీకేని బీహారీ డెకాయిట్ గా విమర్శించిన చంద్రబాబు సైతం 2019 ఎన్నికల ఫలితాల్ని చూసేసరికి వ్యూహం మార్చారు. పీకే మాజీ సహచరుడు రాబిన్ శర్మను నియమించుకున్నారు. అయితే ఇప్పుడు జగన్, చంద్రబాబు వారిద్దరినీ వదిలించుకున్నారు.

ఏపీలో రాజకీయ వ్యూహకర్తలు

ఏపీలో రాజకీయ వ్యూహకర్తలు

వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిన ఏపీ రాజకీయ చదరంగంలో ఎత్తులకు పైఎత్తులకు 2014 ఎన్నికలు బాట వేశాయి. ఆ ఎన్నికల్లో వెంట్రుకవాసిలో విజయం తప్పిపోయిందన్న ఆవేదన వైఎస్ జగన్ కు ప్రశాంత్ కిషోర్ ను దగ్గర చేసింది. 2019 ఎన్నికల్లో జగన్ కు భారీ విజయం కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ పై చంద్రబాబుకు పెరిగిన నమ్మకం రాబిన్ శర్మను ఆయనకు ఆ తర్వాత దగ్గర చేసింది. కానీ పీకే వైసీపీకి అందించిన విజయం చరిత్రలో నిలిచిపోగా.. రాబిన్ శర్మ ఏపీ స్ధానిక ఎన్నికల్లో టీడీపీని గట్టెక్కించలేకపోవడం వ్యూహకర్తల సామర్ధ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. కారణాలేవైనా వీరిద్దరినీ ఇప్పుడు జగన్, చంద్రబాబు వదిలించేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

రాబిన్ శర్మను వదిలించేసుకున్న చంద్రబాబు

రాబిన్ శర్మను వదిలించేసుకున్న చంద్రబాబు


2019 ఎన్నికలకు ముందు తన సొంత వ్యూహాల కంటే వ్యూహకర్తల వ్యూహలేవీ గొప్పవి కావనే అంచనాల్లో ఉన్న చంద్రబాబుకు జగన్ విజయం ఆలోచనలో పడేసింది. దీనికి ప్రశాంత్ కిషోర్ వేసిన వ్యూహాలే కారణమనే అంచనాకు చంద్రబాబు వచ్చేశారు. దీంతో తాను కూడా ఐప్యాక్ లో గతంలో పనిచేసిన రాబిన్ శర్మను తెచ్చిపెట్టుకున్నారు. అయితే తిరుపతి ఉపఎన్నికతో పాటు మున్సిపల్, పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో టీడీపీకి తగిలిన షాకులు చంద్రబాబులో రాబిన్ శర్మపై అసహనాన్ని పెంచాయి. దీంతో ఆయన్నుసాగనంపేశారు. ఆ తర్వాత కూడా సునీల్ కానుగోలు అనే వ్యూహకర్త సలహాలు తీసుకుంటుున్నారని ప్రచారం జరిగినా ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో చంద్రబాబు సొంత వ్యూహాలతోనే 2024 ఎన్నికలు ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.

పీకేను వదిలించేసుకున్న జగన్

పీకేను వదిలించేసుకున్న జగన్

2019 ఎన్నికల్లో తమకు భారీ విజయం కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ ను వైఎస్ జగన్ ఎంతో నమ్మారు. ఎంతగా నమ్మారంటే ఆయన్ను ఎన్నికల తర్వాత ఏర్పడిన తన ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సైతం నియమించుకునే దాకా వెళ్లింది. అయితే పీకే అందుకు ఇష్టపడకపోవడంతో ఇది సాధ్యంకాలేదు. అయితే 2024 ఎన్నికలకు మాత్రం పీకే సేవలు తీసుకుందామని భావించిన జగన్ కు ఆయన అనూహ్యంగా షాకిచ్చారు. కాంగ్రెస్ ను జాతీయ స్దాయిలో గట్టెక్కించేందుకు సిద్ధమైన ప్రశాంత్ కిషోర్ ఆ వ్యూహంలో భాగంగా జగన్ తో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. దీంతో జగన్ కు ఒళ్లు మండింది. అదే సమయంలో పీకే ఇద్దరికీ ఉమ్మడిగా పనిచేసినా, విడివిడిగా సేవలు అందించినా అంతిమంగా తమ వ్యూహాలు బయటికి వచ్చేస్తాయని భావించిన జగన్ పీకేకు గుడ్ బై చెప్పేశారు.

సొంత వ్యూహాలతోనే జగన్, చంద్రబాబు ?

సొంత వ్యూహాలతోనే జగన్, చంద్రబాబు ?

గతంలో వ్యూహకర్తల్ని నియమించుకుని సక్సెస్ అయిన జగన్, విఫలమైన చంద్రబాబూ ఇప్పుడు వారిని సాగనంపేశారు. అంతే కాదు సొంత వ్యూహాల్ని రచించే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ గతంలో ఇచ్చిన సలహాలనే తూచా తప్పకుండా పాటిస్తే చాలన్న ఆలోచనలో జగన్ కనిపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం రాబిన్ శర్మ సలహాల ప్రభావం నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదన్న భావనలో ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యూహకర్తలకు ఏపీ రాజకీయాల్లో కాలం చెల్లిందన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో జగన్, చంద్రబాబు ఇద్దరూ ఎన్నికల తరహాలోనే సొంత వ్యూహాలతోనే ప్రత్యర్ధులపై కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్నారు.

English summary
political strategist like prashant kishor and robin sharma's exit may leads ys jagan and chandrababu to design their own plans for 2024 elections in ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X