కళ్లు పెద్దవి చేసుకుని వేలు చూపిస్తూ రౌడీలాగా బెదిరించినా...: బాబుపై జగన్ వ్యాఖ్య

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సైకో పార్టీగా అభివర్ణిస్తూ అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనపై గురువారం శాసనసభలో దుమారం చెలరేగింది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. ఆయన వైసిపి సభా హక్కుల నోటీసును ఇచ్చింది.

ప్రతిపక్ష పార్టీని సైకో పార్టీగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారని, రౌడీ చేష్టలను ప్రజలు హర్షించరని అంటే రాద్ధాంతం చేస్తున్నారని, తమను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని జగన్ అన్నారు.

టిడిపి మంత్రి అదే పనిగా రెచ్చగొట్టడానికి సభా సమయం వృధా చేయడానికి తన నోట్లో నుంచి ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి సైకో పార్టీ అంటారని, ఇటువంటి రౌడీ చేష్టలను ప్రజలు సహించరని అంటే ఆదేదో తామే తప్పు చేసినట్లుగా మళ్లీ వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

YS Jagan comments against Andhra Pradesh CM Nara Chandrababu Naidu

ఇదే సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కళ్లు చేసుకుని ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగానే వేలు చూపిస్తూ రౌడీ మాదిరిగా బెదిరించినా కూడా అది కూడా తమ తప్పే అన్నట్లు చెప్పడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్న చేస్తున్నారు. విజ్ఞత లేని ప్రతిపక్షం వల్ల సమస్యలు వస్తున్నాయని, సభా సమయం వృధా చేయడం మంచిది కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+