వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపితో పొత్తుపై జగన్ ఇలా: వ్యూహత్మకంగా వైసీపీ అడుగులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: 2019 ఎన్నికల్లో బిజెపితో పొత్తు విషయమై మాట్లాడేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మాట్లాడేందుకు నిరాకరించారు. పొత్తుల గురించి ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు.

ప్రత్యేక హోదా ఇస్తే 2019 ఎన్నికల్లో బిజెపితో తాము పొత్తు పెట్టుకొంటామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ప్రకటించారు. కానీ ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి మాట్లాడుతామని జగన్ తాజాగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

మా పెళ్ళికి ఆ ఇద్దరు ఒప్పుకోలేదు, తిరుపతిలో మైక్ కట్, లైట్లు ఆర్పేశారు: లక్ష్మీపార్వతి సంచలనంమా పెళ్ళికి ఆ ఇద్దరు ఒప్పుకోలేదు, తిరుపతిలో మైక్ కట్, లైట్లు ఆర్పేశారు: లక్ష్మీపార్వతి సంచలనం

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాలపై జగన్ మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు.

బిజెపితో పొత్తుపై మాట్లాడేందుకు నిరాకరించిన జగన్

బిజెపితో పొత్తుపై మాట్లాడేందుకు నిరాకరించిన జగన్

2019 ఎన్నికల సమయంలో పొత్తులపై మాట్లాడేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నిరాకరించారు. ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి ఆలోచిస్తామని వైఎస్ జగన్ చెప్పారు. బిజెపితో పొత్తుకు రెడీ అని ప్రకటించిన జగన్ తాజాగా తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం బిజెపితో పొత్తు విషయమై మాట్లాడేందుకు నిరాకరించారు.

వ్యూహత్మకంగానే జగన్ అడుగులు

వ్యూహత్మకంగానే జగన్ అడుగులు

బిజెపికి వైసీపీ సన్నిహితమౌతోందనే ప్రచారం సాగుతోంది. గత ఏడాది జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో వైసీపీ ఎన్‌డిఏ అభ్యర్థికి మద్దతుగా ఓటేసింది. అయితే మైనార్టీలు వైసీపీకి మొదటి నుండి అండగా ఉంటున్నారు. అయితే బిజెపితో పొత్తు పెట్టుకొంటే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయాలు ఉన్న కారణంగా వైసీపీ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందనే రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల హమీలు నెరవేర్చలేదు

ఎన్నికల హమీలు నెరవేర్చలేదు

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను ఆయన నెరవేర్చలేదని వైఎస్ జగన్ హమీ ఇచ్చారు.తప్పుడు హమీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారని జగన్ విమర్శించారు.ప్రజలను బాబు మోసం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసుకొంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను పూర్తి చేయకుండానే చేసినట్టుగా చెప్పుకొంటున్నారని జగన్ చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కూడగట్టేనా

ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కూడగట్టేనా

చంద్రబాబుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలను వైసీపీ అధినేత కూడగడుతారా, లేదా అనే విషయాలపై జగన్ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎన్నికల సమయంలో ఈ విషయాలపై చర్చించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఏ రకమైన వ్యూహన్ని అనుసరిస్తామనే విషయాన్ని జగన్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

English summary
Ysrcp chief Ys Jagan refused to comment on YSRCP-BJP alliance now saying there is still much time to talk about alliances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X