YS Jagan : డిక్లరేషన్ చర్చకు అలా చెక్ పెట్టేసిన జగన్..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారం కోల్పోయినా, కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో విపక్షంలో ఉన్నా, విపక్ష నేత హోదా లేకపోయినా ఆయన పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ నెల 27న అంటే ఇవాళ జగన్ తిరుపతికి వెళ్తున్నారని, ఆయన అక్కడ ఈసారి డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని అధికార టీడీపీ ఓ ప్రచారం ప్రారంభించింది. సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆయన తిరుమల శ్రీవారి దర్శనాలు చేసుకున్నారనే విషయాన్ని ప్రచారంలోకి తెచ్చింది.
అయితే ఇదంతా ఒట్టి ప్రచారమేనని, జగన్ అస్సలు తిరుపతికే వెళ్లడం లేదని తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఇదంతా టీడీపీ ఫేక్ ప్రచారమేనని ఆయన తేల్చేశారు. దీంతో అప్పటివరకూ టీడీపీ నేతలు చేసిన విమర్శలు, వ్యాఖ్యలు అంతా ఒట్టివేనని తేలిపోయింది. అయితే టీడీపీ ఇంత వ్యూహాత్మకంగా చేసిన ప్రచారానికి కౌంటర్ ఇవ్వాలని అనుకున్నారో ఏమో వైఎస్ జగన్ ఇవాళ ఎట్టి పరిస్ధితుల్లోనూ గణపతి పూజలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.

విజయవాడలోని రాణిగారి తోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం వద్దకు వెళ్లి పూజ నిర్వహించాలని వైఎస్ జగన్ భావించారు. అయితే ఇవాళ నగరంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జగన్ నగరంలోకి వెళ్లి గణేష్ పూజలో పాల్గొనే పరిస్ధితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పరిస్ధితిని గ్రహించిన జగన్ తాడేపల్లిలో తన ఇంట్లోనే గణేష్ పూజకు ఏర్పాట్లు చేయించారు. అక్కడే ఆయన ఇవాళ గణేష్ పూజ చేశారు. దీంతో జగన్ పంతం నెగ్గినట్లయింది.

తిరుమల డిక్లరేషన్ పేరుతో టీడీపీ మొదలుపెట్టిన ప్రచారం సద్దుమణిగినా జగన్ చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకున్నారనే మరో ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఇలాంటి సమయంలో ఇంట్లోనే వినాయక చవితి సందర్బంగా గణేశ్ పూజ నిర్వహించడం ద్వారా జగన్ ఆ ప్రచారాలకు కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఇవాళ జగన్ గణేష్ పూజ నిర్వహించడంతో అప్పటివరకూ ఆయనపై వచ్చిన విమర్శలకు చెక్ పడినట్లయింది. ఈ నెలలో ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొనకుండా దూరంగా ఉన్న జగన్ ఈసారి అలాంటి పొరబాట్లకు తావివ్వకుండా గణేష్ పూజలో పాల్గొనడంతో వైసీపీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
తిరుమలకు పెరుగుతున్న రద్దీ వేళ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications