జమిలి వస్తే జరిగేది ఇదే, ఈవీఎంలపై ఇక - జగన్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈడీ విచారణ వేగవంతం అయిందని..చంద్రబాబు, ఆయన పీఏను ఈడీ అరెస్ట్ చేయదా అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇసుక, మద్యం పాలసీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. జమిలి ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని జగన్ వెల్లడించారు.

జమిలికి సిద్దం
మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈవీఎంల పైన అనుమానాల పై ఇప్పటికే కోర్టుల్లో కేసులు వేసామని వెల్లడించారు. ఈసీకి మనసులో కల్మషం లేకపోతే మేము కోరిన విధంగా ఈవీఎం, వీవీపాట్స్ మ్యాచ్ చేస్తే అనుమానాలు తొలిగిపోతాయన్నారు. ఎందుకు చేయటం లేదో తెలియటం లేదన్నారు. ఈ తీరుతో అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. వరద సాయం పేరుతో కోట్లు కొట్టేసారని ఆరోపించారు. స్కిల్ స్కాం కేసులో ఎక్కడా చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. ఈడీ మరింత లోతుగా విచారణ చేస్తుందని చెప్పుకొచ్చారు.

YS Jagan criticised the Govt new excise policy and Sand Rates

క్లీన్ చిట్ ఇవ్వలేదు
ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయటంతో పాటుగా ఆస్తులు అటాచ్ చేసిందని జగన్ చెప్పారు. ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీల అమలు జరగటం లేదన్నారు. మద్యం పేరుతో మాఫియా నడుపుతున్నారని.. ఎమ్మెల్యేలే సుంకం కట్టాలని కోరుతున్నారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు, చంద్రబాబుకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన డిస్టలరీలే తమ హయాంలో కొనసాగించామని జగన్ వెల్లడించారు. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేటుకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని జగన్ విమర్శించారు.

ఉచిత ఇసుక ఎక్కడ
ఉచిత ఇసుక అక్రమాలకు అడ్రస్ గా మారిందన్నారు. 141 నియోజకవర్గాల్లో సగటున లారీ ఇసుక 20 వేల కంటే ఎక్కువ ఉందని జగన్ చెప్పారు. ఇసుక పై ఆదాయం గతం లో వచ్చేది ఇప్పుడు ఏమీ రావటం లేదన్నారు. కానీ, రేట్లు గతం కంటే ఇప్పుడు రెండింతలు పెరిగాయని వివరించారు.
పండుగ వేళ రెండు రోజుల సమయంతో ఇసుక టెండర్లు ఇచ్చారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వీరితో కలిసిందని..ఇక ఎవరినీ లెక్క చేయాల్సిన అవసరం లేదనే విధంగా ఏపీలో వ్యవహారం నడుస్తుందన్నారు. మద్యం వ్యాపారాన్ని తన మాఫియాకు అప్పగించారని జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+