AP Elections: మోడీ ముందు చెప్పగలవా ? ..చంద్రబాబుకు జగన్ సవాల్..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ సీఎం వైఎస్ జగన్ ఓ కీలక అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. తద్వారా విపక్ష ఎన్డీయే కూటమిని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ త్వరలో రాష్ట్రానికి ప్రచారం కోసం రానున్న నేపథ్యంలో వైఎస్ జగన్ చంద్రబాబుకు ఈ సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ తేల్చిచెప్పేశారు. 4శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు జత కడతాడంటూ బీజేపీని ఉద్దేశించి నెల్లూరులో జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మైనార్టీల ఒట్ల కోసం డ్రామాలు ఆడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్ ఉండి తీరాల్సిందేనని మీ బిడ్డ చెబుతున్నాదన్నారు, దీనికోసం ఎంతైనా పోరాడతానన్నారు.

ఇదే మాట బాబు చెప్పగలడా, ఎన్డీఏ నుంచి బయటకివచ్చి పోరాడగలడా.. ఎందుకు ఈ దొంగ ప్రేమ అంటూ చంద్రబాబుపై జగన్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఏ అంశమైనా సరే మైనార్టీలకు అండగా జగన్ ఉంటాడన్నారు. తాజాగా ఎన్డీయే మ్యానిఫెస్టోలో సైతం ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రస్తావించని నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ రాక వేళ చంద్రబాబు, పవన్ ను ఇరుకున పెట్టేందుకే జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications