YS Jagan: ఏకసభ్య కమిషన్ పై తేల్చేసిన జగన్..! జోగి కుటుంబానికి పరామర్శ..!
తిరుమల నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని సీబీఐ ఛార్జిషీట్ నిర్ధారించిన తర్వాత ఫ్రస్టేషన్ లో వైసీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ (ys jagan) ఆరోపించారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని సందర్శించిన జగన్.. జరిగిన విధ్వంసాన్ని స్వయంగా పరిశీలించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి దాడికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. పార్టీ తరఫున అండగా ఉంటామని జోగి కుటుంబానికి జగన్ హామీ ఇచ్చారు. జోగి రమేశ్ ఇంటిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలు ఫతావుల్లా, ఆశ ఫొటోలు, వీడియోల్ని జగన్ బయటపెట్టారు.
లడ్డూ నెయ్యి వివాదంలో సీబీఐ ఛార్జ్‌షీట్ వాస్తవాలు తేల్చేసిందని, చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పిందని జగన్ తెలిపారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసిందన్నారు. అయినా చంద్రబాబు అన్యాయమైన దుష్ప్రచారం చేశారన్నారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు. కానీ, ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చారన్నారు.

ఒక అబద్దాన్ని సృష్టించి రాజకీయాల కోసం దేవుణ్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు మాత్రమే అన్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలు అని సీబీఐ ఛార్జ్‌షీట్ ద్వారా స్పష్టం చేసిందన్నారు. ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌ల నివేదికలు అదే విషయాన్ని తేల్చి చెప్పాయన్నారు. టీటీడీ ఛైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కూడా ఏ తప్పు చేయలేదని సీబీఐ నిర్ధారించిందని జగన్ తెలిపారు. అందుకే వారి పేర్లు ఛార్జ్‌షీట్‌లో పెట్టలేదని, అరెస్టు చేయలేదని తెలిపారు. టీటీడీ తిప్పి పంపిన ట్యాంకర్లు వేరే డెయిరీ పేరుతో వస్తే తిరిగి లడ్డూకు వాడారన్నారు. ఈ వ్యవహారంలో స్వామివారిని క్షమాపణ కోరి చెంపలేసుకోవాలన్నారు.

సుప్రీంకోర్టు సూపర్‌విజన్‌లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ కు ప్రాధాన్యత ఉందని, అదే చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న వన్ మ్యాన్ కమిషన్, కేవలం తన అబద్ధాలు నిజమని చెప్పేందుకే కాబట్టి దానికి ఏ మాత్రం విలువ ఉండదని జగన్ తెలిపారు. ఇలాంటి పనులు ఆయనున ఇంకా దిగజారుస్తాయన్నారు. సీబీఐ రిపోర్టు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నీవు చేస్తున్నదేమిటి?. నీ అనుకూల రిపోర్టు కోసం మరో కమిషన్ వేసుకుంటున్నావు? అని జగన్ ప్రశ్నించారు. మరో మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఇప్పుడు తప్పు చేస్తున్న పోలీసులు, అధికారులు, నాయకులు, గుండాగిరి చేస్తున్న ప్రతి ఒక్కరిని బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications