Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు ఔరంగజేబు-జనాల్ని రెచ్చగొట్టి ఏడుస్తాడు-డిప్యూటీ సీఎం కామెంట్స్

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ముదురుతోంది. కుప్పం లో టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ఈ తరుణంలో కుప్పంలో ఈ నెల 23న సీఎం జగన్ పర్యటించబోతున్నారు. దీంతో మాటలయుద్ధం పెరిగింది.ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలకు దిగారు.

ఈ నెల 23న సీఎం కుప్పం రాబోతున్నారని నారాయణస్వామి తెలిపారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. చంద్రబాబు తప్పుడు మీడియాని పెట్టుకుని బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. పేదవాడి పిల్లాడు చక్కగా చదువుకోవాలని అమ్మ ఒడి తెచ్చారని, 85 శాతం మందికి కుప్పం లో అమ్మ ఒడి వర్తింపు చేస్తున్నామని నారాయణ స్వామి తెలిపారు. చంద్రబాబు కుప్పం ప్రజలకు ఒక్కరికైన డబ్బులు ఇచ్చాడా ఒక్కరి అకౌంట్ లో అయినా డబ్బులు వేసాడా అని ప్రశ్నించారు.

ys jagans deputy cm narayana swamy slams chandrababu-says foul cry after provoking public

నాన్ లోకల్ చంద్రబాబు లోకల్ గా ఏమీ చేయలేదని డిప్యూటీ సీఎం ఆరోపించారు. 175నియోజకవర్గాలు గెలుస్తాం దానికి కుప్పం నాంది అని ఆయన అన్నారు. చంద్రబాబు ఎప్పుడు కుప్పం వచ్చిన గలాటాలే,రచ్చలే అని నారాయణ స్వామి విమర్శించారు. జనాన్ని రెచ్చగొట్టి బోరుమని ఏడుస్తాడని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక ఔరంగాజేబు లాంటోడన్నారు. చంద్రబాబు కుప్పం లో పోటీ చేస్తే...వైసీపీ 60 శాతం ఓట్లతో గెలుస్తుందని నారాయణస్వామి తెలిపారు.

చంద్రబాబు ది రాక్షస మనస్తత్వం...జన్మలో మారడన్నారు. జడ్జ్ లు కూడా రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నరన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు సపోర్ట్ చెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పేద వారికి సెంటు భూమి ఇస్తే కూడా స్టేలు ఇస్తున్నారని నారాయణ స్వామి విమర్శించారు. మద్యం పై నడిచింది టీడీపీ.. వైసీపీ కాదన్నారు. ఒకరోజు టైం చెప్తే మద్యం పై పూర్తి క్లారిటీ తో మాట్లాడతానన్నారు. సారా ను తీసుకొచ్చిందే టీడీపీ అని నారాయణ స్వామి ఆరోపించారు. తాను మద్యం పై చర్చకు సిద్దంగా ఉన్నానన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+