హుధుద్: జగన్ విరాళం రూ. 50 లక్షలు, లోకేష్ రెడీ

హైదరాబాద్: హుధుద్ తుఫాను విలయంతో సర్వం కోల్పోయిన ఉత్తరాంధ్రప్రజలకు బాసటగా నిలవడానికి పలువురు ముందుకు వస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం తమ వంతు కర్తవ్యంగా భావించి విరాళాలు అందజేస్తున్నారు. హుధుద్ బాధితుల సహాయార్థం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
బాధితులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందజేస్తున్నట్లు శ్రీఅహోబిల రామానుజ జీయర్ స్వామి తెలిపారు. హదూద్ తుఫాను బాధితుల కోసం రూ. 3,11,116 విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నట్లు యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి.శ్యామసుందర్ చెప్పారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు.
యోగివేమన విశ్వవిద్యాలయంలో తనతో పాటు పని చేస్తున్న అధ్యాపకులు ఉద్యోగులు, వ్యక్తిగతంగా తమ నెల జీతంలో ఒక రోజు వేతనాన్ని, విద్యార్ధులు ఒక్కొక్కరూ వంద రూపాయలు చొప్పున తుఫాను బాధితులకు సహాయంగా విరాళాన్ని అందజేస్తున్నామన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవలు
తుఫాన్ బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ రంగంలోకి దిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని తుఫాను బాధితుల కోసం రోజూ 10 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు ట్రస్ట్ సీఈఓ చుక్కా కొండయ్య తెలిపారు. బుధవారం విశాఖలో మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడు మొదటి ఆరోగ్యశిబిరాన్ని ప్రారంభించారన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టీ నారా లోకేష్ పర్యవేక్షణలో మరో 5 రోజుల పాటు ఈ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ శిబిరాల ద్వారా దాదాపు 50 వేల మందికి లబ్ధి చేకూరే విధంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. డాక్టర్లు బృందాలుగా ఏర్పడి ఈ శిబిరాల్లో సేవలందిస్తున్నారని తెలిపారు.
యశోద ఆస్పత్రి వైద్య బృందం
హుధుద్ విధ్వంసం బారిన పడిన ప్రాంతాల్లో బాధితులకు వైద్యసేవలు అందించేందుకు యశోద ఆస్పత్రుల వైద్య బృందం బుధవారం విశాఖపట్నం బయలుదేరింది. ఈ మేరకు యశోద ఆస్పత్రుల సీఈఓ డాక్టర్ చంద్రశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదుగురు వైద్యులతో బాటు ఆరుగురు మెడికల్ టెక్నీషియన్ల తమ బృందం ఈసీజీ, అల్ట్రా సౌండ్, ఆక్సిజన్, వెంటిలేటర్‌లు, ఇతర అత్యవసర మందులు తీసుకొని విశాఖకు వెళ్లినట్లు తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్య లు చేపట్టడం, వ్యాధులబారిన పడినవారికి ఉచిత వైద్యసేవలను అందిస్తారని తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications