రఘురామ ప్రత్యర్ధికి జగన్ ప్రమోషన్- ఇప్పటికే చుక్కలు ! ఇక ఆ హోదాతో ..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీతో విభేదించడం మొదలుపెట్టి రెబెల్ ఎంపీగా పేరు తెచ్చుకున్న కనుమూరు రఘురామకృష్ణంరాజును కట్టడి చేసేందుకు సీఎం జగన్ పలు అస్త్రాలు సంధించారు. ఇందులో ఓ కీలక అధికారి కూడా ఉన్నారు. ఆయన సాయంతో రఘురామను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో రఘురామ కూడా అంతే దీటుగా ఆయనపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. చివరికి వారిద్దరి పోరు అలాగే కొనసాగుతుండగానే ఈ అధికారికి జగన్ కీలక ప్రమోషన్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్
1993 బ్యాచ్ ఏపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ప్రస్తుతం సీఐడీ ఛీఫ్ గా ఉన్నారు. అదనపు డీజీపీ హోదాలో అయన సీఐడీ ఛీఫ్ బాధ్యతలు చూస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో సర్కార్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని, జగన్ పై పోస్టులు పెట్టే వారిని, వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టుల్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే అధికార పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తారన్న ఆరోపణలు సునీల్ పై వచ్చాయి.
దీంతో పాటు వరకట్న వేధింపుల వ్యవహారంలోనూ ఆయన చిక్కుకున్నారు. అయితే ఇవేవీ ఆయన్ను వైసీపీ ప్రభుత్వంలో అడ్డుకోలేకపోయాయి. ఇదే క్రమంలో వైసీపీతో విభేదిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామను టార్గెట్ చేసి కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.

పీవీ సునీల్ కు డీజీపీ ప్రమోషన్
అదనపు డీజీపీ హోదాలో సీఐడీ ఛీఫ్ గా పనిచేస్తున్న పీవీ సునీల్ కుమార్ కు జగన్ సర్కార్ తాజాగా డీజీపీ ప్రమోషన్ కల్పించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, ఫిర్యాదులు కానీ దీనికి అడ్డు కాలేదు. మరో ఇద్దరు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏపీ క్యాడర్ ఐపీఎస్ లు మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్ తో కలిపి పీవీ సునీల్ కుమార్ కు ప్రభుత్వం డీజీపీ హోదాలో ఎలివేషన్ ఇచ్చింది. దీంతో ఆయన ఇప్పుడు డీజీ ర్యాంకులోనే సీఐడీ ఛీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. తద్వారా జగన్ సర్కార్ కు మరింత విధేయంగా పనిచేసే అవకాశం ఆయనకు లభించినట్లయింది.

ఎన్నికల వేళ కీలకం?
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. వచ్చే ఏడాది ఎన్నికల వాతావరణంలోకి రాష్ట్రం వెళుతుంది. అప్పుడు ప్రభుత్వానికి కూడా సీఐడీతో పని పెరుగుతుంది. అలాగే భవిష్యత్తులో డీజీపీ ర్యాంకులో ఉండే అధికారి రాష్ట్ర పోలీసు బాస్ గా ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో తమకు అత్యంత విధేయుడైన పీవీ సునీల్ కుమార్ కు జగన్ సర్కార్ డీజీ ర్యాంకులో ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా సీఐడీ ఛీఫ్ గానే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తరుణంలో ఆయన్ను కీలక పోస్టులో నియమించి వాడుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications