రోజాకు మద్దతుగా రంగంలోకి జగన్..! నా చెల్లెలిపై..ఎమోషనల్ ట్వీట్..!
వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందిస్తూ.. రోజా కంటతడి కూడా పెట్టారు. తన పిల్లల ఫోటోల్ని సైతం మార్ఫింగ్ చేసి విమర్శలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ రోజాకు మద్దతుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు రోజాకు సంఘీభావం ప్రకటించగా.. ఇవాళ జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని జగన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, నా సోదరి రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పని చేసిన ఆర్‌కె రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారన్నారు.

ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదని,తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనమని జగన్ అభివర్ణించారు. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారన్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారన్నారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్‌గా మారిందన్నారు.
ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు, విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారన్నారు. ఆ కోవలోనే గత ఏడాది కాలంగా అనేక మంది మహిళా నాయకురాళ్లను వారు దారుణంగా వేధించారని, అవమానించారని తెలిపారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్‌కె రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారన్నారు.
The shocking verbal abuse hurled by TDP MLA Gali Bhanu Prakash against @RojaSelvamaniRK is yet another example of the deeply rotten culture within the TDP. Roja, my sister, a two-time MLA and former minister, was subjected to filthy, degrading, and offensive language simply for…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2025
ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది? టీడీపీ గుండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మర్చి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయన్నారు. నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు, మాజీ మంత్రి విడదల రజని, కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికతో పాటు, మా పార్టీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదన్నారు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదన్నారు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్‌కె రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications