జగన్ ఉద్వేగ భరిత ట్వీట్-జనం చిరునవ్వుల్లో మీరెప్పుడూ-జయంతి వేళ తండ్రిని తల్చుకుంటూ
ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ ఇవాళ ప్లీనరీ నిర్వహించుకుంటోంది. అదే సమయంలో కడప జిల్లా పులివెందులలోని ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి వైఎస్సార్ కు సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఆ తర్వాత సీఎం జగన్ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగమైన ట్వీట్ పెట్టారు.
"నాన్నా.. మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపం కనిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన మీ జీవితమే నాకు స్ఫూర్తి. ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకం" అంటూ సీఎం జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రతీ ఏటా వైఎస్ జయంతి,వర్ధంతుల సందర్భంగా తండ్రిని గుర్తుచేసుకోవడం సర్వసాధారణమే అయినా ఈసారి జగన్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

తండ్రి అడుగుజాడల్లో 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించి సీఎం స్ధాయికి చేరుకున్న వైఎస్ జగన్.. తండ్రి మరణం తర్వాత ఏ చిన్న సందర్భం వచ్చినా ఆయన్ను గుర్తుచేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పలు సందర్భాల్లో జగన్ భావోద్వేగంగా స్పందించిన సందర్భాలు, ట్వీట్ లు కూడా ఉన్నాయి. ఇదే కోవలో ఇసారి కూడా జగన్ తన తండ్రిని, జనంలో ఆయనకు ఉన్న ఆదరణను కూడా కలిపి ట్వీట్ పెట్టడం విశేషం. వైసీపీ ప్లీనరీ వేళ జగన్ ట్వీట్ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications