అక్రమాస్తుల కేసులో జగన్ మరో డిశ్చార్జ్ పిటిషన్-పెన్నా సిమెంట్స్ కేసులో-22న విచారణ
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ శరవేగంగా సాగుతోంది. పెండింగ్ లో ఉన్న పిటిషన్లపై త్వరగా ఏదో ఒకటి తేల్చాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో సీబీఐ కోర్టు కేసుల పరిష్కారానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తాను నిందితుడిగా ఉన్న పెన్నా సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.
తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ హయాంలో పెన్సా సిమెంట్స్ జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడాన్ని సీబీఐ తన ఛార్జిషీట్ లో తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో జగన్ ను ఈ కేసులో ఏ1గా చేర్చింది. దీనిపై జగన్ సీబీఐ కోర్టులో ఇవాళ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా సిమెంట్స్ ఛార్జిషీట్ నుంచి తన పేరు తొలగించాలని ఆయన సీబీఐ కోర్టును కోరారు. అయితే దీనిపై సీబీఐ ఇచ్చే కౌంటర్ ఆధారంగా సీబీఐ కోర్టు ఈ నెల 22న విచారణ జరపబోతోంది.

ఇదే కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా ఛార్షిషీట్ లో తన పేరు సీబీఐ చేర్చడంపై సబిత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై సీబీఐ నుంచి కౌంటర్ రాలేదు. కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరడంతో సీబీఐ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు రాజగోపాల్, శామ్యూల్ కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇవన్నీ 22న విచారణకు రానున్నాయి.












Click it and Unblock the Notifications