వైఎస్సార్సీపీ అరుదైన ఫీట్- ఎన్నికల రేసులో విపక్షాలను దాటి ఏకంగా 47 వేల....

ఏపీలో మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు పూర్తిస్దాయిలో సన్నద్ధమవుతున్న అధికార వైసీపీ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే విపక్షాలు పొత్తులు, సీట్ల పంపకాల విషయంలో మల్లగుల్లాలు పడుతుంటే మరోవైపు 175 సీట్లలో అభ్యర్ధులను దాదాపు తేల్చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు మరో విషయంలోనూ ముందంజ వేసింది. తద్వారా రాష్ట్రంలో విపక్షాల కంటే ఎన్నికల రేసులో తాను ఎంత ముందుందీ మరోసారి నిరూపించుకుంది.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 సీట్ల సాధనే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వైసీపీ.. అందులో కీలకమైన బూత్ కమిటీల నియామకాన్ని పూర్తి చేసేసింది. రాష్ట్రవ్యాప్తంగా 47 వేల పోలింగ్ బూత్ కమిటీల నియామకాల్ని వైసీపీ పూర్తి చేసేసింది. ఇందుకోసం నిర్వహించిన "మేం సిద్ధం- మా బూత్ సిద్ధం" కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎన్నికల సన్నద్ధతలో కీలక అడుగు వేసింది. బూత్ లెవల్ పోల్ మేనేజ్ మెంట్ ద్వారా గత ఎన్నికల్లో భారీ ఫలితాలను సాధించిన వైసీపీ.. ఈసారి కూడా అదే స్ధాయిలో ఈ ప్రక్రియను చేపడుతోంది.

ys jagan finishes 47k booth committees appointment as part of why not 175 target

ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా సిద్దం సభల పేరుతో క్యాడర్ మీట్ లు నిర్వహిస్తున్న సీఎం జగన్ .. సాధారణంగా ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన బూత్ కమిటీల నియామకాన్ని ఈసారి 50 రోజుల ముందే పూర్తి చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. తద్వారా ఎన్నికల సన్నాహకాల్లో తామెంత ముందు ఉన్నామో మరోసారి నిరూపించారు. అలాగే ఇప్పటికే అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరడంతో సీఎం జగన్ కార్యకర్తల సన్నాహంపై దృష్టి సారించారు.

రాష్ర్ట రాజకీయాల్లో ఇంత వరకు ఏ పార్టీ చేయని విధంగా సోషల్ ఇంజనీరింగ్ రూపంలో సాహసం చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్. గ్రామ స్థాయిలో వార్డు సభ్యుల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యుల నుంచి మండల అధ్యక్షుల వరకు, జెడ్పీటీసీ సభ్యుల నుంచి జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, క్యాబినెట్ మంత్రుల వరకు 80 శాతం ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి చరిత్ర సృష్టించారు.

ఇదే క్రమంలో సీఎం జగన్ ప్రతీ నియోజకవర్గంలో పార్టీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్దుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ కు అనుగుణంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. ఓ వైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్న వైసీపీ.. పార్టీ ఎన్నికల పరిశీలకులతో పాటుగా ప్రతీ వార్డులోనూ ప్రత్యేకంగా పార్టీ కన్వీనర్లను నియమిస్తోంది. ప్రతీ పోలింగ్ బూత్ స్థాయిలో 15 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 వేలకు పైగా పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+