వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభేదాలొద్దు, కలిసిపనిచేయండి: ఆ ఇద్దరు నేతలకు క్లాస్ పీకిన జగన్

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: ప్రతిపాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభేదాల కారణంగా గొడవపడిన వైసీపీ నేతలు మురళీరాజు, పర్వతప్రసాద్‌లకు జగన్ తన శిబిరం వద్దకు పిలిచి క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది.

కత్తిపూడి క్రాస్ రోడ్డు నుంచి జరిగిన పాదయాత్రలో మురళీరాజు మేనల్లుడిపై పర్వతప్రసాద్ చేసుకున్నారు. దీనిపై వాకబు చేసిన జగన్ సోమవారం రాత్రి కాకినాడ పార్లమెంటు కన్వీనర్ కురసాల కన్నబాబు సమక్షంలో ఇరువర్గాలు విభేదాలు వీడి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించినట్లు తెలిసింది.

ys jagan fires at his party leaders parvatha prasad and Murali Raju

మురళీరాజు ఏర్పాటు చేసిన ప్రచార బెలూన్‌లపై కో-ఆర్డినేటర్ ప్రసాద్ ఫొటో లేకపోవడంపై ఆయన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. సోమవారం పోటాపోటీగా జెండాలు ప్రదర్శించగా.. జగన్ హితబోధతో మంగళవారం విభేదాలు విడిచిపెట్టి ఇద్దరూ చెరో పక్కన ఉండి పాదయాత్ర సాగించడం గమనార్హం.

English summary
YSRCP president YS Jaganmohan Reddy fired at his party leaders parvatha prasad and Murali Raju and told work together for party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X