స్వాతంత్రం వచ్చిందా: టిలో జగన్ జెండావిష్కరణ, ఏపీలో రగడ, మంత్రుల అలక

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని లోటస్ పాండులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 70 ఏళ్లు అవుతున్నా అందరికీ స్వాతంత్రం వచ్చిందా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇంకా దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా జగన్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయన అంతకుముందు సమరయోధుల చిత్రపఠాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రుల అసంతృప్తి

స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రాలలో జెండా ఆవిష్కరణ చేసే అంశంపై తమకు అన్యాయం జరిగిందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా జిల్లా మంత్రులు పతాకాలను ఆవిష్కరిస్తుంటారు. ఈ ఏడాది జిల్లా మంత్రులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- విశాఖపట్నంలో యనమల రామకృష్ణుడు అధికారిక ఉత్సవంలో పాల్గొని జెండాను ఎగురవేస్తున్నారు. తనకు అవకాశం ఇవ్వలేదని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు అలిగినట్లుగా తెలుస్తోంది.
- ప్రకాశం జిల్లా నుంచి శిద్ధా రాఘవ రావు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. ఆయనను పక్కన పెట్టిన అధికారులు రావెల కిశోర్ బాబుకు అవకాశమిచ్చారని తెలుస్తోంది. దీనిపై శిద్ధా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో తిరిగి శిద్ధాను పిలవడంతో.. తనను పిలిచి అవమానించారని రావెల మనస్తాపాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
- పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి మాణిక్యాలరావుకు జెండా వందనం అవకాశం లభించింది. ఇదే జిల్లాకు చెందిన పీతల సుజాత తన అసంతృప్తిని తెలిపినట్టుగా తెలుస్తోంది.

స్పీకర్ నోట 'మోడీ'

- ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి సాధించాలని మంత్రి కోడెల శివప్రసాద రావు అన్నారు. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఏపీలోనే నిర్వహిస్తామని చెప్పారు.
- మంత్రి శిద్ధా రాఘవ రావు ఒంగోలు పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
- కాకినాడలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
- మంత్రి అచ్చెన్నాయుడు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తదుపరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, ఎంతకాలం పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందన్న అంశాలపై భవిష్యత్ వాణి వినిపించిన అచ్చెన్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్న శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... ఏపీలో 2050 దాకా టీడీపీనే అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేసినా గడచిన రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఆయన చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా ఏపీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. తమ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, ఈ కారణంగానే తమ పార్టీ 2050 దాకా అధికారంలో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

జగన్

జగన్

హైదరాబాదులోని లోటస్ పాండలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం వైసిపి అధినేత జగన్ మాట్లాడారు.

జగన్

జగన్

చంద్రబాబు పాలనలో ప్రజలకు స్వాతంత్ర్యం లేకుండా పోయిందని, దళితులపై దాడులు జరగడం తన మనసును కలచి వేసిందని జగన్ వ్యాఖ్యానించారు.

జగన్

జగన్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలైన తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయంటే, ఇక స్వాతంత్ర్యం ఎక్కడ వచ్చినట్లని ప్రశ్నించారు.

జగన్

జగన్

తూర్పు గోదావరి జిల్లాలో చనిపోయిన ఆవు చర్మాన్ని తీసుకెళుతున్న వారిపై నిర్దయగా దాడి చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, కులం, మతం ఆధారంగా మనుషులను విడదీసే భావన నశించాలన్నారు.

జగన్

జగన్

పాలకులు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయని, అనంతపురంలో చంద్రబాబు ప్రసంగం వాస్తవానికి ఎంతో దూరంగా ఉందన్నారు.

జగన్

జగన్

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, రాజ్యాంగాన్ని వెటకారం చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆయన విమర్శించారు.

జగన్

జగన్

కళ్ల ముందు నల్లధనంతో ప్రజా ప్రతినిధులను కొంటూ అడ్డంగా దొరికిపోయినా, ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటే, పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఆలోచించాలని ప్రజలను కోరారు.

జగన్

జగన్

వ్యవస్థలో మార్పు రావాల్సి ఉందని, ప్రజలు నిజానిజాలను ఆలోచించాలని జగన్ కోరారు. రెండు గంటలపాటు ప్రసంగించిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి పెడుతున్నట్టు స్వయంగా అంగీకరించారని విమర్శించారు.

జగన్

జగన్

920 కి.మీ తీర ప్రాంతాన్ని సింగపూర్ కంపెనీలకు, విలువైన అమరావతి ప్రాంతాన్ని చైనా కంపెనీలకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+