భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంఖుస్ధాపన..2026లో తానే ప్రారంభిస్తానని ధీమా...

ఏపీలోని విజయనగరం జిల్లాలో కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ ఇవాళ శంఖుస్ధాపన చేశారు. మూడేళ్లలో తొలి దశ నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ విమానాశ్రయం పనుల్ని జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం భోగాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ మాట్లాడారు. 2026లో తానే ఎయిర్ పోర్టును ప్రారంభిస్తానని జగన్ స్ధానికులకు హామీ ఇచ్చారు.

రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర చరిత్రను మార్చే మూడు కార్యక్రమాల్ని ఇవాళ మొదలుపెడుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతీ ప్రాంతం,ప్రతీ గ్రామం, ప్రతీ ఇల్లూ బాగుపడేలా గత మూడేళ్లలో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. విప్లవాల గడ్డ అయిన ఉత్తరాంధ్ర.. ఇక మీదట అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుందన్నారు. శ్రీకాకుళంలో మూలపేట పోర్టుతో పాటు భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయన్నారు. 24 నెలల్లో మూలపేట పోర్టు పూర్తయి ఓడలు రాబోతున్నాయన్నారు. ఉత్తరాంధ్రకు మూలపేట పోర్టు మణిహారం అవుతుంటే భోగాపురం కిరీటం కాబోతుందన్నారు.

ys jagan

ఉత్తరాంధ్రలో స్ధానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు వచ్చే పరిస్ధితులు రాబోతున్నట్లు జగన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడికే వచ్చే పరిస్దితి వస్తుందన్నారు. మూడేళ్లలో భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తవుతుందని, మళ్లీ 2026లో మీ బిడ్డ జగన్ ఇక్కడికి వచ్చి ప్రారంభిస్తాడని కూడా జగన్ ధీమా వ్యక్తం చేశారు. మీ బిడ్డ జగన్ కు ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరెన్ని కుట్రలు పన్నినా ఏమీ చేయలేరన్నారు. చంద్రబాబు హయాంలో భోగాపురం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్జీటీల్లో కేసులు పరిష్కరించుకుని ఇవాళ శంఖుస్ధాపన చేశామన్నారు. భూసేకరణ పూర్తిచేసి, కేంద్రం నుంచి అన్ని అనుమతులు తెచ్చామన్నారు.

గతంలో చంద్రబాబు ఎన్నికలకు కేవలం రెండు, మూడు నెలల ముందు రావడం టెంకాయ కొట్టి వెళ్లారంటూ జగన్ ఆక్షేపించారు. గతంలోనే మేం శంఖుస్ధాపన చేశామంటూ మళ్లీ చెప్పుకోవడం దారుణమన్నారు. ఇంతకన్నా దారుణ పరిస్ధితి రాజకీయాల్లో ఎక్కడా ఉండదన్నారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు రెండు రన్ వేలతో ప్రారంభం అవుతుందని జగన్ హామీ ఇచ్చారు. దాదాపు ఐదు వేల కోట్లతో , రెండు ఏరో బ్రిడ్జ్ లు, కార్గో యూనిట్లు, ఏవియేషన్ అకాడమీ వంటి సదుపాయాలతో 2026లో ఈ ఎయిర్ పోర్టు ప్రారంభమవుతుందన్నారు. ట్రాఫిక్ పెరిగే కొద్దీ 60 లక్షల జనాభాకు తొలిదశలో అందుబాటులోకి వస్తుందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఏ 380 డబుల్ డెకర్ కూడా ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్ పోర్టులో రెండు రన్ వేలు నిర్మిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఎయిర్ పోర్టు పక్కనే మరో 500 ఎకరాల్లో ఏరో సిటీ కూడా రాబోతోందన్నారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మిస్తున్న జీఎంఆర్ మల్లిఖార్జునరావును 36 నెలల్లో పూర్తవ్వాల్సిన ఈ ప్రాజెక్టు అంతకంటే ముందే చేస్తారా అని అడిగితే ఆయన 30 నెలల్లో పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తానని హామీ ఇచ్చారన్నారు. తనకు దీనిపై నమ్మకం ఉందన్నారు. ఎయిర్ పోర్టుకు అనుమతించిన ప్రధాని, కేంద్రమంత్రులకు, భూములిచ్చిన రైతులకూ జగన్ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తరాంధ్ర అంటే బ్రిటీషర్లను గడగడలాడించిన అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ అని జగన్ తెలిపారు. ఆ విప్లవ వీరుడిని మర్చిపోలేదని, అందుకే ఉత్తరాంధ్రలో కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టామన్నారు. మూడు జిల్లాల ఉత్తరాంధ్రకు ముగ్గరు కలెక్టర్లు, ముగ్గరు ఎస్పీలు సరిపోరని, ఆరు జిల్లాలు చేశామన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కిడ్నీ పరిశోధన కేంద్రం పెట్టామన్నారు. జూన్ లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ జాతికి అంకితం చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+