వినుకొండకు వైఎస్ జగన్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య దాడుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వినుకొండలో నడిరోడ్డుపై వైసీపీ నేత రషీద్ హత్య ఏపీలో సంచలనంగా మారింది.

వైసీపీ కార్యకర్త హత్యతో పల్నాడులో టెన్షన్
పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ యువజన విభాగ నేత రషీద్ ని జిలాని అనే వ్యక్తి నడిరోడ్డు పై రెండు చేతులు నరికి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ హత్య ఘటన పైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని నడిరోడ్డుపై జరిగిన దారుణ మారణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ స్పందించిన జగన్ బెంగళూరు నుండి హుటాహుటిని ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారు.

ys jagan going to vinukonda tomorrow to console rasheed family who has merdered by TDP activist

వినుకొండకు జగన్
కాగా రేపు ఉదయం వైయస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండలో పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. ఇదిలా ఉంటే రషీద్ హత్య పైన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు అతి కిరాతకంగా చంపిన రషీద్ కుటుంబాన్ని రేపు జగన్ పరామర్శిస్తారని, ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడం కోసమే వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు వినుకొండ వస్తున్నారని తెలిపారు.

అధికారం ఇచ్చింది ప్రజల్ని పార్టులు పార్టులుగా నరకటానికా
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది అన్న ఆయన వందలాది మంది ప్రజలు, పోలీసులు ఉండగా అత్యంత దారుణంగా నడిరోడ్డుపై వైసీపీ నేత దారుణ హత్యకు గురికావడం హేయమన్నారు. తెలుగుదేశం నాయకుడు నడిరోడ్డుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపడం అంటే ఇంతకన్నా దారుణం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల్ని పార్టులు పార్టులుగా నరకడానికా అని ప్రశ్నించారు.

వినుకొండలో కొత్త సాంప్రదాయానికి బీజం వేసిన టీడీపీ
వినుకొండలో తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయానికి బీజం వేసిందని, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడని రషీద్ ని తెలుగుదేశం నేతలు చంపేశారని ఆయన ఆరోపించారు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున డబ్బులు ఇచ్చి తన కొడుకుని అత్యంత దారుణంగా హత్య చేయించారని రషీద్ తల్లి చెబుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+