అసైన్డ్ భూముల యజమానులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్...
ఏపీలో అసైన్డ్ భూముల యజమానులకు సీఎం వైఎస్ జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఓ కీలక ఆర్డినెన్స్ విడుదల చేశారు. దీంతో అసైన్డ్ భూముల యజమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓ అంశంపై క్లారిటీ లభించింది. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో వేల ఎకరాల అసైన్డ్ భూముల యజమాన్య హక్కుల విషయంలో ఈ ఉత్తర్వులు ప్రభావం చూపబోతున్నాయి.
ఏపీలో వేలాది ఎకరాల భూముల్ని గతంలో బలహీన వర్గాలకు అసైన్డ్ భూముల రూపంలో ప్రభుత్వాలు కేటాయించాయి. వీటిలో ఇళ్లు కట్టుకోవడానికి లేదా ఇతరత్రా అవసరాలకు వాడుకోవడానికే తప్ప అమ్ముకోవడానికి వీల్లేదు. దీంతో వారు అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ప్రజాప్రతినిధులపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. దీంతో తాజాగా ప్రభుత్వం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1977 నాటి భూబదలాయింపు చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు.

రాష్ట్రంలో కనీసం 20 ఏళ్ల క్రితం పంచిన అసైన్డ్ భూముల్ని అమ్ముకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. దీని అమలుకు వీలుగా ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ విడుదల చేసింది. ఇందులో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అసైన్డ్ భూములకు వాటిని తీసుకున్న వారికి యాజమాన్య హక్కులు వస్తాయి. దీంతో వాటి యజమానులు సదరు అసైన్డ్ భూములు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరించబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఆర్డినెన్స్ విడుదల చేశారు.
అయితే ఇలా అమ్ముకునే భూముల విషయంలో ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. అసైన్డ్ భూముల పక్కన వ్యవసాయేతర భూములు ఉండి, వాటి మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటే మాత్రం కొనుగోలు దారు ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వం రాష్ట్రంలో తాజాగా పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్ధలాల్ని సైతం పదేళ్ల తర్వాత అమ్ముకునే అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తాజా ఆర్డినెన్స్ లో ప్రస్తావించింది.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications