కారుణ్య నియామక ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్..

ఏపీలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ సమస్య నుంచి వారికి ఊరటనిచ్చారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కారుణ్య నియామకాల ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులుగా నియమించేందుకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ప్రభుత్వ ఉత్తర్వులపై ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం కారుణ్య నియామకం కింద టైపిస్ట్/ స్టెనోగ్రాఫర్ గా ఉద్యోగం పొందిన ఉద్యోగులు తెలుగు/ ఇంగ్లిష్ టైప్ రైటింగ్ టెస్ట్ పాస్ అయితేనే వారి సర్వీసు రెగ్యులర్ చేసేవారు. టైపింగ్ కి ప్రాధాన్యత లేకపోవడంతో అది నేర్పే వాళ్ళు లేక ఆ పరీక్ష పాస్ కాలేక చాలా మంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి రెగ్యులర్ కాక పీఆర్సీ అమలు కాక చాలా తక్కువ జీతంతో ఇబ్బందులు పడుతున్నారు.

jagan20

ఈ పరిస్థితిని గమనించిన ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ .. కారుణ్య నియామకం ద్వారా నియమకాలు పొందిన ఉద్యోగులకు తెలుగు టైప్ రైటింగ్ పరీక్షను మినహాయించాలని సీఎం వైఎస్ జగన్ ను కోరాయి. దీంతో ప్రభుత్వం వీరి అభ్యర్ధనను పరిశీలించి కారుణ్య నియామకం ద్వారా నియమితులైన ఉద్యోగులకు తెలుగు / ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్ష మినహాయిస్తూ ఈరోజు జీవో ఎంఎస్ నెంబర్ 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

ఎంతోకాలంగా ఇబ్బంది పడుతున్న కారుణ్య నియామక ఉద్యోగుల సమస్యను పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్ కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి, జీఏడీ అధికారులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఉద్యోగ సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్న ప్రభుత్వం మరోసారి వారికి అండగా నిలిచిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+