కాంట్రాక్టు ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్-ఉత్తర్వుల విడుదల..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇవాళ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ఇవాళ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులను ఎలా క్రమబద్ధీకరించాలన్న దానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట రామిరెడ్డి, సెక్రటరీ అరవపాల్ హర్షం వ్యక్తం చేశారు.

ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సంబంధించి గైడ్ లైన్స్ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. సర్కులర్ మెమో 13-12-2023 ద్వారా ఆర్థిక శాఖ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఈ నెల 15వ తేదీన నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన సాఫ్ట్ వేర్ లో ఉద్యోగుల నమోదు ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం మిగతా చర్యలు చేపట్టబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ys jagan good news to contract employees as guidelines released for regularisation

వచ్చే సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. వైఎస్ జగన్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ వారి జీవితాలలో వెలుగు నింపినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞలు తెలియజేస్తున్నట్లు ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఈ ప్రక్రియ జనవరిలో పూర్తయితే కాంట్రాక్టు ఉద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మరో ఎన్నికల ముందు నెరవేర్చినట్లవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+