షర్మిల స్పీచ్, జగన్ నవ్వులు: లక్ష ఇచ్చిన లక్ష్మీపార్వతి

సోదరి షర్మిల మాట్లాడుతుండగా జగన్ చిరునవ్వులు చిందించారు. జగన్, షర్మిలల మధ్య విభేదాలు వచ్చినట్లుగా కొంతకాలం జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. షర్మిల ప్లీనరీకి హాజరయ్యారు. ఆమె జగన్‌కు అండగా ఉంటానని చెప్పారు. తన సోదరుడితో తనకు విభేదాలు ఉన్నట్లు తెలుగు మీడియా విష ప్రచారం చేస్తోందని ఆమె చెబుతున్నప్పుడు జగన్ నవ్వులు చిందించారు. మరోవైపు పలువురు నేతలు పార్టీకి విరాళం ఇచ్చారు. లక్ష్మీ పార్వతి లక్ష రూపాయలు ఇచ్చారు.
జగన్ నాయకత్వంలో సమైక్యం కాపాడుకుందాం
జగన్ నాయకత్వంలో సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకుందామని వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. ఇడుపులపాయలో జరుగుతున్న వైకాపా ప్లీనరీలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమైక్యం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అన్నారు. కిరణ్, చంద్రబాబులే రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులని ఆరోపించారు. టీబిల్లును కేంద్రానికి పంపడంలో కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనిపిస్తోందని తెలిపారు. జగన్‌ను అక్రమంగా జైల్లో నిర్బంధించారని 90 రోజుల్లో రావాల్సిన బెయిలును రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
బురద జల్లడమే
జగన్ పైన ఎల్లో మీడియా బురద జల్లడమే పనిగా పెట్టుకుందని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. జగన్‌ను ఇరుకులో పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లును తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 60 నుంచి 70 స్థానాల వరకు గెలుపొందుతుందన్న ఉద్యేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ కుట్రకు పాల్పడిందని అన్నారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తారన్నారు.












Click it and Unblock the Notifications