అసెంబ్లీకి జగన్ హాజరు వెనుక - అక్కడే నిర్ణయం..!!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించటం ద్వారా ఆరంభం కానున్న సమావేశాలు దాదాపు మూడు వారాలు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ సమావేశంలో అసెంబ్లీ అజెండా .. బిల్లుల పైన స్పష్టత రానుంది. ఈ రోజు జరిగే సమావేశానికి మాజీ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హాజరు కానున్నారు. తనకు ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి రానని చెప్పిన జగన్.. ఇప్పుడు సభకు హాజరవ్వాలని నిర్ణయం వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ఆలోచన ఏంటి..
జగన్ నిర్ణయం
ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవ్వాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజున జగన్ తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ఆ తరువాత సమావేశాలకు దూరంగా ఉన్నారు. సభలో కూటమి పార్టీలు కాకుండా.. ఇతర పక్షంగా తమ పార్టీ మాత్రమే ఉందని.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. సభలో పదో శాతం సీట్లు రాకుండా ప్రతి పక్ష హోదా ఇవ్వలేమని ఇప్పటికే స్పీకర్ తో సహా సీఎం తేల్చి చెప్పారు. ఇప్పటికే ఇదే అంశం పైన జగన్ న్యాయ పోరాటం చేస్తున్నారు.

నేడు హాజరు
అయితే, ఇప్పుడు ఈ రోజు జరిగే సమావేశాలకు హాజరు కావాలని జగన్ ఆకస్మికంగా నిర్ణయం తీసు కున్నారు. ఈ రోజు గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా కోసం నిరసనకు దిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, రేపటి నుంచి జగన్ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని సమాచారం. బడ్జెట్ రోజున తిరిగి వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జగన్ ఈ రోజు సమావేశం ముగిసిన తరువాత పులివెందుల వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ ఖరారు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవటం పైన ఇప్పటికే రాజకీయం గా విమర్శలు వస్తున్నాయి. అయితే, జగన్ ఎన్ని రోజులు సభకు హాజరవుతారనేది ఇప్పటికీ పార్టీ లోనే స్పష్టత లేదు.
ఇలా చేద్దాం
కూటమి ప్రభుత్వం పై వైసీపీ పోరుబాట ప్రారంభించినా.. జగన్ మాత్రం ఇప్పటి వరకు మిర్చి రైతు అంశం పైన మాత్రమే బయటకు వచ్చారు. గుంటూరు లో మిర్చి యార్డులో రైతులను పరామ ర్శించారు. జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటన చేయాలని జగన్ నిర్ణయించారు. అసెంబ్లీకి వెళ్లినా తనకు మైకు ఇవ్వరని ఇప్పటి వరకు జగన్ పలు సందర్భా ల్లో చెబుతూ వచ్చారు. అయితే, తాజాగా పార్టీ నేతల సమావేశంలో అసెంబ్లీకి వెళ్లి మైకు ఇవ్వక పో తే బయటకు రావాలనే సూచన వచ్చింది. దీంతో, జగన్ ఈ సమావేశాల్లో సభకు వచ్చే ఛాన్స్ ఉం దనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సభలో ఇప్పుడు జగన్ కు ఎలాంటి అవకాశం వస్తుంది.. ఇటు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తి కరంగా మారుతోంది












Click it and Unblock the Notifications