అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్తుల వెల్లడికి దూరం: వైయస్ జగన్ సహా 13 మంది ఏపీ మంత్రులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఇంకా తమ ఆస్తులను వెల్లడించిన వారు చాలా మంది ఉన్నారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను ఇప్పటి వరకూ 46 మంది మాత్రమే తమ ఆస్తులను వెల్లడించారు.

వీరిలో అందికంటే ముందు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నియోజవర్గానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్ మాత్రం తన ఆస్తులను వెల్లడించలేదు.

వైయస్ జగన్ కడప జిల్లాలోని పులివెందుల నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే వైయస్ జగన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పలు కూడా తమ ఆస్తులను ప్రకటించలేదు.

 Ys Jagan has not revealed his assets to assembly

ఇక చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారాయణ, శిద్ధా రాఘవరావు, కిమిడి మృణాళిని, పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత, పరిటాల సునీత కూడా తమ ఆస్తులను ప్రకటించలేదు.

వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, విప్ చింతమనేని ప్రభాకర్ కూడా తమ ఆస్తులను వెల్లడించలేదు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసససభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం ఆస్తుల వివరాలను వెల్లడించిన వారి వివరాలను ప్రకటించారు.

English summary
Ys Jagan has not revealed his assets to assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X