Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రశాంత్ కిషోర్-జగన్ మధ్య డీల్ ఎంత?: ఎమ్మెల్యేల జాతకాలు మొదలు..

2019 ఎన్నికల్లో గెలుపు కోసం వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపారు. వైసిపి తరఫున ఆయన తన పనిని ఎప్పుడో ప్రారంభించారు.

అమరావతి: 2019 ఎన్నికల్లో గెలుపు కోసం వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపారు. వైసిపి తరఫున ఆయన తన పనిని ఎప్పుడో ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్‌తో డీల్ ఎంతకు కుదిరిందనే చర్చ సాగుతోంది. గతంలో రూ.200 కోట్లకు డీల్ కుదిరినట్లు ప్రచారం జరిగింది. వీటిని ప్రశాంత్ కిషోర్ కొట్టి పారేశారు.

రూ.50 కోట్లు అంటూ ప్రచారం

రూ.50 కోట్లు అంటూ ప్రచారం

తాజాగా, మరో ప్రచారం సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ - జగన్‌ల మధ్య రూ.50 కోట్లకు డీల్ కుదిరిందనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో రూ.200, ఇప్పుడు రూ.50 కోట్ల మాట వినిపించినప్పటికీ, డీల్ ఎంతకు కుదిరిందనేది జగన్-ప్రశాంత్ కిషోర్‌లతో పాటు మరి కొందరికి మాత్రమే తెలిసి ఉంటుందని అంటున్నారు.

2019లో అధికారంలోకి తేవడమే..

2019లో అధికారంలోకి తేవడమే..

రూ.50 కోట్లకు డీల్ కుదుర్చుకున్న ప్రశాంత్ కిషోర్ వైసిపిని అధికారంలోకి తేవడమే వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఆయన... వైసిపి ఎమ్మెల్యేల జాతకాలు అధినేత జగన్ ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక అంశాలపై ఆయన దృష్టి సారిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ - జగన్‌ల మధ్య డీల్ 2019 వరకు అని చెబుతున్నారు. డీల్ యాభై కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉన్నా ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

కిషోర్ వ్యూహాలు అధికారంలోకి తేవడానికి...

కిషోర్ వ్యూహాలు అధికారంలోకి తేవడానికి...

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, అనుభవాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని 2019లో ఎలాగైనా అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఉపకరిస్తాయని జగన్‌తో పాటు వైసిపి నేతలు ధీమాగా ఉన్నారు. 2014లో బిజెపి కోసం, ఆ తర్వాత నితీష్ కుమార్ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేశారు. ఆయన వ్యూహాలు అప్పడు వారికి లాభం చేకూర్చాయి.

ఉత్తర ప్రదేశ్‌లో ఫెయిల్

ఉత్తర ప్రదేశ్‌లో ఫెయిల్

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఇటీవలి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విఫలమయ్యాయి. కాంగ్రెస్ పార్టీని ఆయన అధికారంలోకి తీసుకు రాలేకపోయారు. ఇప్పుడు ఏపీ టిడిపి నేతలు ఇదే విషయాన్ని చెబుతున్నారు. యూపీలో ప్రశాంత్ కిషోర్ బొక్క బోర్లా పడ్డారని, అక్కడ రాహుల్ గాంధీ అండ్ కోకు పట్టిన గతే ఇక్కడ జగన్‌కు పడుతుందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+