YS Jagan: అందుకే 81 ఎమ్మెల్యేల మార్పు ! మోడీ ఎందుకు వదిలేశారో ? తాజా ఇంటర్వ్యూలో జగన్

ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార వైసీపీ, విపక్ష ఎన్డీయే కూటమి మధ్య ముఖాముఖీ పోరు నెలకొంది. ఈ తరుణంలో రాష్ట్రంలో తాజా పరిస్ధితిపై జాతీయ మీడియా సంస్థ ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఈసారి భారీఎత్తున ఎమ్మెల్యే అభ్యర్ధుల మార్పులు, ఎన్డీయేతో పొత్తు, విపక్షాలతో మోడీ బంధం, రాజధాని, ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరికి మద్దతు వంటి అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగి ఉంటే 81 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాంటూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ వేసిన ప్రశ్నకు సమాధానంగా జగన్.. ప్రతీ రాజకీయ పార్టీ సొంత సర్వే చేయిస్తుందని, అందులో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనని, కానీ వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్లే వారిని మార్చామని వెల్లడించారు. వాస్తవానికి ఈ ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికలు కాదు, భవిష్యత్తు కోసం జరిగే పోరు అన్నారు.

ys jagan interesting comments on sitting mlas change support to nda after polls and opposition

ఎన్నికల్లో అభ్యర్ధులను మీరే నిర్ణయించారు, ఎవరు ఉండాలి, ఎవర్ని తప్పించాలనేది మీరే నిర్ణయించారు, ఇది హైరిస్క్ కాదాఅనే ప్రశ్నకు జగన్.. ఇది రిస్క్ అంశం కాదు, తన పాలనపై ఉన్న నమ్మకం వల్లే అన్నారు. మళ్లీ గెలిచి విశాఖకు రాజధాని మారుస్తారనే నమ్మకం ఉందా అని అడిగితే.. ఎవరైనా లక్షకోట్లు అమరావతిలో పెట్టాలని ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నామన్నారు. ఎవరు కరెక్ట్ అనేది కోర్టులు నిర్ణయిస్తాయన్నారు.

తనకు కోర్టుల మీద నమ్మకం ఉందని, ఏ తప్పూ చేయకపోతే 52 రోజులు ఓ వ్యక్తి జైల్లో ఎందుకుంటాడంటూ చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. కేంద్రంతో మీ బంధం ఏంటన్న ప్రశ్నకు టీడీపీతో పొత్తు పెట్టుకున్న వాళ్లనే అడగాలన్నారు. చంద్రబాబు, మోడీనే ఈ విషయం అడగాలన్నారు. చంద్రబాబు, మోడీ మేం అభివృద్ధి కోసమే కలిశామంటున్నారు కదా.. అని అడిగితే..ఈ ఐదేళ్లూ అభివృద్ధి కోసమేగా ఆయనతో సత్సంబంధాలు కొనసాగించామన్నారు.కేంద్రంలో ఈసారి మోడీకి 20 సీట్లు తగ్గితే మద్దతిస్తారా అంటే ఇది ఊహాజనిత ప్రశ్న అని జగన్ సమాధానం ఇచ్చారు. ఎందుకంటే వారు (బీజేపీ) తాను పోరాడేవాళ్లతో కలిసి తన మీద పోరాడుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+