వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైజాగ్ వెళ్తున్నా.. పెట్టుబడులు పెట్టేందుకు రండి-విదేశీ ఇన్వెస్టర్లకు వైఎస్ జగన్ పిలుపు..

ఏపీలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం వైసీపీ సర్కార్ మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు సన్నాహకంగా ఇవాళ ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో పెట్టుబడిదారులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. వ్యాపారవేత్తలకు చేరువయ్యేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి చాలా ప్రత్యేకతలున్నాయని జగన్ తెలిపారు. భారత్ ను కూడా అంతర్జాతీయంగా ప్రత్యేక స్ధానంలో నిలబెట్టినందుకు ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఏపీ వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్ధానంలో ఉందని విదేశీ పెట్టుబడిదారులకు వైఎస్ జగన్ వివరించారు. 974 కిలోమీటర్ల తీరం ఉందని, ఆరు పోర్టులున్నాయని జగన్ వారికి తెలిపారు. మరో నాలుగు త్వరలో మొదలుపెడతామన్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ప్రారంభించబోతున్నట్లు వారికి జగన్ వెల్లడించారు.
కేంద్రం దేశంలో మొదలుపెడుతున్న 11 కారిడార్లలో మూడు ఏపీలో వస్తున్నాయన్నారు. ఇది పారిశ్రామికవేత్తలకు శుభవార్త అన్నారు. 48 ఖనిజాలకు కేంద్రం ఏపీ అన్నారు.

ys jagan invite global investors to vizag, says he will also be shifted to new capital

21 రోజుల్లోనే పరిశ్రమల స్ధాపనకు అనుమతిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఎలక్ట్రానిక్, తయారీ క్లస్టర్లు ఇప్పటికే ఎన్నో పనిచేస్తున్నాయని పెట్టుబడిదారులకు తెలిపారు. టెక్స్ టైల్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు. మరోవైపు త్వరలో రాజధాని అవుతున్న విశాఖకు రావాలని పెట్టుబడిదారుల్ని సీఎం జగన్ కోరారు.తాను కూడా త్వరలో రాజధానికి మారుతున్నానన్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతోందని, దీనికి హాజరుకావాలని అందరినీ కోరుతున్నానని జగన్ తెలిపారు. మా రాష్ట్రం ఏపీలో వ్యాపారం ఎంత సులువుగా చేయొచ్చో అక్కడికి వచ్చి తెలుసుకోవాలని సూచించారు.

English summary
ap cm ys jagan has urged global investors to come to his state for investment and reveal that he will shift to new capital vizag soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X